జాతీయ వార్తలు

పాక్ భూభాగం మీదుగా ప్రధాని వెళ్లరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 12: కిర్గిస్తాన్ పర్యటనకు వెళ్లనున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్ భూభాగం మీదుగా వెళ్లబోరని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కిర్గిస్తాన్ రాజధాని బిష్కెక్‌లో గురువారం నుంచి రెండు రోజులపాటు జరుగనున్న షాంగై కోపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సమావేశంలోప్రధాని మోదీ పాల్గొంటారు. అక్కడికి వెళ్లడానికి విమాన సర్వీసు పాకిస్తాన్ భూభాగం మీదుగా ఉంది. ఈ మార్గంలో మోదీ ప్రయాణించడానికి అనుమతించాల్సిందిగా పాకిస్తాన్ అధికారులకు భారత్ విజ్ఞప్తి చేసింది. దీనిపై పాక్ సానుకూలంగా స్పందించి అనుమతిని మంజూరు చేసింది. అయితే, తాజా సమాచారం ప్రకారం పాక్ భూభాగం మీదుగా ఎస్‌సీఓ సదస్సుకు మోదీ వెళ్లకూడదని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అందుకే ఒమన్, ఇరాన్‌తోపాటు పలు మధ్య ఆసియా దేశాల మీదుగా ప్రయాణించి బిష్కెక్ చేరుకుంటారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఈ సదస్సుకు హాజరుకానున్నారు.