జాతీయ వార్తలు

మోదీ సారథ్యంలో ‘అయోధ్య’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయోధ్య (యూపీ), జూన్ 15: శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాక్రే ఆదివారం అయోధ్యలోని తాత్కాలిక రాంలీలా ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారని ఆ పార్టీ నాయకుడు సంజయ్ రౌట్ తెలిపారు. అయోధ్యలో అపూర్వమైన రామాలయం నిర్మాణం కేవలం ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోనే జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత రామాలయాన్ని సందర్శిస్తామంటూ గత నవంబర్‌లో ఇచ్చిన హామీని థాక్రే నెరవేర్చుకుంటున్నారని ఆయన చెప్పారు. ఈ అయోధ్య సందర్శనలో 18 మంది కొత్తగా ఎన్నికైన తమ పార్టీ ఎంపీలు కూడా పాల్గొంటారని ఆయన తెలిపారు. రాముడి పేరుతో తాము ఓట్లు అడగలేదని, భవిష్యత్తులో కూడా ఈ అంశాన్ని ఆసరా చేసుకుని ఓట్లు అడిగేది లేదని సంజయ్ రౌట్ చెప్పారు. తమ పార్టీ అధ్యక్షుడు థాక్రే ఆదివారం ఉదయం అయోధ్యకు చేరుకుంటారని, పూజల అనంతరం మీడియా సమావేశంలో పాల్గొని సాయంత్రం వెనుదిరుగుతారని ఆయన వెల్లడించారు.