జాతీయ వార్తలు

మహిళల ప్రవేశ నిషేధం రాజ్యాంగ విరుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: ఆచారాలపేరుతో శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతించకపోవడం ఏమాత్రం సమర్థనీయం కాదని, ఇది రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకమని సుప్రీంకోర్టు బుధవారం వ్యాఖ్యానించింది. ‘ఆచారాల పేరుతో మహిళలకు ఆలయ ప్రవేశాన్ని నిరాకరించలేరు. ఇది రాజ్యాంగ విరుద్ధం’ అని జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే మహిళలను ఆలయంలోకి అనుమతించాలని కోరుతూ దాఖలయిన పిటిషన్‌ను అయిదుగురు న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనానికి నివేదించాలన్న వాదనతో ప్రస్తుతానికి ఏకీభవించడం లేదని న్యాయమూర్తులు వి గోపాల్ గౌడ, కురియన్ జోసెఫ్ కూడా ఉన్న బెంచ్ స్పష్టం చేసింది. రాజ్యాంగ పరమైన ప్రాధాన్యత ఉందని భావిస్తే ఆ విషయాన్ని ఆ తర్వాత పరిశీలిస్తామని బెంచ్ స్పష్టం చేసింది. ఆలయ ప్రవేశాన్ని నిషేధించడం ద్వారా మహిళలు భారత దేశంలో ‘నయా హరిజనులు’గా మారుతున్నారంటూ వాదనల సందర్భంగా సీనియర్ మహిళా న్యాయవాది ఇందిరా జైసింగ్ చేసిన వ్యాఖ్యల పట్ల బెంచ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘మీరు అలా ఎందుకంటారు? మీరు ఆదిశక్తి. మహిళలు ఈ తరాన్ని సృష్టించారు. మేము సమానమనే మీరు అనాలి’ అని బెంచ్ వ్యాఖ్యానించింది. దీంతో ఆమె ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. హిందూమతంలో హిందూ పురుషుడు, హిందూ మహిళ అని వర్గీకరణ లేదని, హిందువంటే హిందువేనని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. అంతేకాదు అయ్యప్ప స్వామి విగ్రహం పవిత్రతను కాపాడడం కోసమే మహిళలను ఆలయంలోకి అనుమతించడం లేదన్న విషయం జోలికి తాము వెళ్లడం లేదని, కేవలం రాజ్యాంగపరమైన సూత్రాల ఆధారంగా ఆలయంలోకి వెళ్లడానికి మహిళలకు హక్కు ఉందా లేదా అనే విషయాన్ని నిర్ణయిస్తామని బెంచ్ స్పష్టం చేసింది. ఈ కేసు తదుపరి విచారణ ఈ నెల 18న తిరిగి ప్రారంభమవుతుంది.