తెలంగాణ

పాడి పంటల విధానంతో రాష్ట్రం సుభిక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూలై 5: పాడి పంటల విధానంతోనే రైతులు అభివృద్ధి చెంది తెలంగాణ సుభిక్షమవుతుందని సీఎం కేసీఆర్ విశ్వాసమని అందుకు అనుగుణంగానే పశుపోషణ, గొర్రెల పెంపకానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పశుసంవర్ధక శాఖ ఈనెల 22 వరకు నిర్వహించనున్న పశువులకు గాలికుంటు టీకాల రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని గురువారం నల్లగొండ జిల్లా చర్లపల్లి గ్రామంలో విద్యాశాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డితో కలిసి తలసాని ప్రారంభించారు. ఈ సందర్భంగా పశుసంవర్ధక శాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శనను ప్రారంభించి తిలకించారు. అనంతరం పాడి రైతులు, గొర్రెల పెంపకందారులతో సమావేశమయ్యారు. జిల్లా కేంద్రంలో 5 కోట్లతో నిర్మించిన ఆధునిక పశువైద్యశాల భవనాన్ని వారు ప్రారంభించారు. చర్లపల్లిలో రైతుల సమావేశంలో మంత్రి తలసాని మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పశుసంపద పెంపొందించే లక్ష్యంతో ప్రభుత్వం సబ్సిడీ గేదెల పంపిణీ, గాలికుంటు టీకాల వ్యాక్సినేషన్ చేపట్టిందన్నారు. పాడి రైతులకు పలు ప్రోత్సాహాకాలు అందిస్తుందన్నారు. పాడి పోషణతో రైతులు మరింత స్వయం సమృద్ధి సాధిస్తారన్నారు. టీకాలు వేయిస్తే గేదెలు పాలు తక్కువగా ఇస్తాయన్న అపోహాలను వీడి వాటి సంరక్షణకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని సూచించారు. ఆసుపత్రులు, అంబులెన్స్‌లను ఏర్పాటు చేసి గ్రామాల్లోకి పశువైద్య బృందాలు వెళ్లి ఉచిత చికిత్సలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. పశువైద్యుల సలహాలను పాటించి రైతులు పాడి పోషణలో మెరుగైన లాభాలు సాధించాలన్నారు.
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రైతుల సంక్షేమం పాడి పంటల విధానంతో సాధ్యమన్నారు. వ్యవసాయ రంగంలో పాడి పోషణ ప్రాధాన్యతను గుర్తించిన సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పాలు, మాంసం కొరతలను, దిగుమతులను అధిగమించేందుకు, రైతులు, గొర్రెల పెంపకందారులు అభివృద్ధి చెందేందుకు సబ్సిడీపై ఆవులు, గేదెలు, గొర్రెల పంపిణీ పథకాలు చేపట్టారన్నారు. పశుపోషణ లేకుండా వ్యవసాయం చేయడం సరికాదని, భూముల సారం, పర్యావరణ పరిరక్షణకు పశువుల కీలకమన్నారు. పంటల సాగుతో పాటు పాడిపోషణలో ప్రభుత్వం అందిస్తున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకుని వ్యవసాయాన్ని లాభసాటిగా మలుచుకోవాలని సూచించారు. మదర్ డెయిరీ చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి, కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, గాదరి కిషోర్, ఎన్. భాస్కర్‌రావు, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, నాయకులు వేమిరెడ్డి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.