తెలంగాణ

విద్యార్థులపై తేనెటీగల దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొయిలకొండ, జూలై 6: మండలంలోని సూరారం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులపై తేనె టీగలు దాడి చేయడంతో 25 మంది అస్వస్థత కావడం జరిగింది. పాఠశాల ఉపాధ్యాయుల సమాచారం మేరకు శనివారం మధ్యాహ్నం విద్యార్థులు పాఠశాల ఆవరణలో ఆడుకోవడానికి వెళ్లడం జరిగింది. గాలి బాగా రావడంతో పాఠశాల ప్రాంగణంలోనే గల చింతచెట్టుపై నుండి ఒక్కసారిగా తేనె టీగలు విద్యార్థులపై దాడికి పాల్పడటంతో పాఠశాలలోని 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడం జరిగింది. పాఠశాలలోని చాలా మంది పిల్లలకు సైతం కొద్దిపాటి గాయాలు కావడం జరిగింది. 25 మంది విద్యార్థులను కొత్లాబాద్ పీహెచ్‌సికి తరలించినా ఫలితం లేకపోవడంతో కోయిలకొండ సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఎక్కువమంది విద్యార్థులకు సేవలు అందించే వీలు లేకపోవడంతో జిల్లా ఆసుపత్రికి తరలించి విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించడంతో విద్యార్థులు కొలుకున్నారని జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ రాంకిషన్ వెల్లడించారు.