తెలంగాణ

టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీలో 53.59 శాతం ఉత్తీర్ణత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో 53.59 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను పరీక్షల బోర్డు సంచాలకుడు బి సుధాకర్ శనివారం సాయంత్రం విడుదల చేశారు. గత నెల 10వ తేదీ నుండి 24 వరకూ నిర్వహించిన పరీక్షల స్పాట్ వాల్యూయేషన్‌ను జూన్ 28 నాటికి పూర్తి చేశామని ఆయన చెప్పారు. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీకి 61,436 మంది రిజిస్టర్ చేసుకోగా వారిలో 50,192 మంది హాజరయ్యారని, అందులో 26,898 మంది ఉత్తీర్ణులయ్యారని చెప్పారు. బాలురు 50.92 శాతం, బాలికలు 57.90 శాతం పాసయ్యారని చెప్పారు. రాష్ట్రంలో జగిత్యాల జాల్లా 96.50 శాతంతో ఫలితాల్లో అగ్రస్థానంలో నిలవగా, హైదరాబాద్ జిల్లా 34.08 శాతంతో చిట్ట చివరి స్థానంలో నిలిచిందని అన్నారు. గత ఏడాది జూన్‌లో నిర్వహించిన అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ కింటే ఇది 7.8 శాతం ఎక్కువని చెప్పారు. పరీక్షలకు 36,933 మంది బాలురు, 24,503 మంది బాలికలు నమోదుచేసుకోగా, 30999 మంది బాలురు, 19193 మంది బాలికలు హాజరయ్యారని, అందులో 15785 మంది బాలురు, 11113 మంది బాలికలు పాసయ్యారని అన్నారు. పాఠశాలల నుండి కొంత సమాచారం రావల్సి ఉన్నందున, కొంత మంది ఫలితాలను విత్‌హెల్డ్‌లో ఉంచామని, త్వరలోనే వారి ఫలితాలు ప్రకటిస్తామని చెప్పారు. ఎస్సెస్సీ జూన్ 2019లో ఫెయిలైన విద్యార్ధుల నామినల్ రోల్స్‌ను సంబంధిత స్కూళ్లకు పంపిస్తామని ఆయన పేర్కొన్నారు. మార్కులు తిరిగి లెక్కించాలని అనుకుంటే విద్యార్థులు సబ్జెక్టుకు 500 రూపాయిలు చొప్పున జూలై 15వ తేదీలోగా దరఖాస్తు చేయాలని అన్నారు. ఎస్సెస్సీ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి సమాధానపత్రాల పున:పరిశీలనకు సైతం అభ్యర్ధులు జూలై 15లోగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఇటువంటి దరఖాస్తులను కొరియర్, పోస్టు ద్వారా ఆమోదించబోమని అన్నారు. దరఖాస్తు ఫారాలను బోర్డు వెబ్ పోర్టల్ నుండి పొందాలని, ఒక్కో సబ్జెక్టుకు 1000 రూపాయిలు చెల్లించాలని అన్నారు.