తెలంగాణ

భూపాలపల్లి జింకల పార్కులో కలకత్తా బాల కార్మికులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూపాలపల్లి, జూలై 6: భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న జింకల పార్కులో కలకత్తాకు చెందిన బాలకార్మికులు పని చేస్తున్నారనే సమాచారంతో సీఐడీ డీఎస్పీ రవికుమార్ వారిని అదుపులోకి తీసుకున్నారు. శనివారం జింకల పార్కులో పని చేస్తున్న ఆరుగురు బాలకార్మికులను విచారించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ముస్కాన్ ఆపరేషన్ 5లో భాగంగా జూలై 1 నుంచి 31 వరకు సీబీసీఐడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఆపరేషన్‌లో తప్పిపోయిన పిల్లలు, బాల కార్మికులు, బెగ్గింగ్ చిల్డ్రన్, డ్రాపౌట్ చిల్డ్రన్లను గుర్తించి వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. వారికున్న అవకాశాలను బట్టి పాఠశాలలో చేర్పించడంతో పాటు వారి తల్లిదండ్రులను గుర్తించి వారికి అప్పగించడం జరుగుతుందన్నారు. 5 సంవత్సరాలకు ఒకసారి ఈ ఆపరేషన్ కొనసాగుతుందని, ప్రస్తుతం భూపాలపల్లి ప్రాంతంలో మరికొంత మంది బాల కార్మికులు ఉన్నట్లు తమకు సమాచారం ఉందని, వరుసగా దాడులు నిర్వహిస్తామని డీఎస్పీ రవికుమార్ తెలిపారు.
చిత్రం... కోల్‌కతా బాల కార్మికులకు కౌనె్సలింగ్ నిర్వహిస్తున్న డీఎస్పీ