తెలంగాణ

గిరిజన రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 6: రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులు వ్యవసాయం ఆధారంగా చిన్న, మధ్యతరహాలో 15 యూనిట్లను ఏర్పాటు చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. గిరిజన సంక్షేమ శాఖ ద్వారా ‘రైతు ఉత్పత్తిదారుల సంఘాల’లకు ఆర్థిక సాయం చేసే పథకంపై సచివాలయంలో శనివారం ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ సమావేశం నిర్వహించారు. గిడ్డంగులు, కోల్డ్‌స్టోరేజ్ గిడ్డంగులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు తదితర యూనిట్లను ఏర్పాటు చేసుకునేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వందలాది దరఖాస్తులు రాగా, అర్హత కలిగిన 15 రైతు సంఘాలను గిరిజన సంక్షేమ శాఖ ఎంపిక చేసింది. గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి బెన్‌హర్ మహేష్‌దత్ ఎక్కా అధ్యక్షతన సచివాలయంలో ప్రత్యేక సమావేశం జరిగింది. గిరిజన సంక్షేమ శాఖ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో నాబార్డ్, బ్యాంకులు, సెర్ప్, ట్రైకార్ తదితర రంగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మషేష్‌దత్ ఎక్కా మాట్లాడుతూ, ఈ పథకం కింద ఎంపికైన గిరిజన రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు చేయూత ఇస్తామన్నారు. గిడ్డంగులు,కోల్డ్ స్టోరేజ్ గిడ్డంగులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు తదితర యూనిట్లు నిర్మించుకునే సంఘాలకు తమ శాఖ ద్వారా 60 శాతం సబ్సిడీ ఇస్తామని, 30 శాతం బ్యాంకు రుణం ఇస్తుందని, 10 శాతం వాటాధనం రూపంలో సమకూర్చుకోవాల్సి ఉంటుందని గుర్తు చేశారు. ప్రభుత్వం ఇచ్చే చేయూతను సద్వినియోగం చేసుకోవాలని, తద్వారా సత్ఫలితాలు వస్తాయన్నారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ కమిషనర్ డాక్టర్ క్రిస్టినా జెడ్ చోంగ్తు, అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్‌రెడ్డి, ట్రైకార్ డీజీఎం శంకర్‌రావు, జీసీసీ డీజీయం విజయ్‌కుమార్, నాబార్డ్ జీఎం కే.ఐ. షరీఫ్, ఎస్‌బీఐ ఏజీఎం భరణికుమార్, వ్యవసాయ శాఖ జేడీ విజయగౌర్ తదితరులు పాల్గొన్నారు.
చిత్రం... సచివాలయంలో శనివారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో పాల్గొన్న నాబార్డ్, బ్యాంకులు, సెర్ప్ తదితర రంగాలకు చెందిన ఉన్నతాధికారులు