తెలంగాణ

తెలంగాణ సంక్షేమ పథకాలు భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 8: తెలంగాణ రాష్ట్రం బీసీల సంక్షేమానికి అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ప్రశంసనీయంగా ఉన్నాయని జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ భగవాన్‌లాల్ సహాని పేర్కొన్నారు. కమిషన్ వైస్ చైర్మన్ లోకేష్ కుమార్ ప్రజాపతి, సభ్యులు కౌశలేంద్ర సింగ్ పాటిల్, సుధాయాదవ్, ఆచారి తల్లోజులతో కలిసి కమిషన్ సోమవారం నాడు తెలంగాణ పర్యటనకు వచ్చింది. దిల్‌కుషా అతిథి గృహంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డిలతో పాటు ప్రత్యేకంగా బీసీ సంక్షేమ సంఘం చైర్మన్ బీఎస్ రాములు, సభ్యులు డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహనరావు, డాక్టర్ ఆంజనేయగౌడ్, జూలూరు గౌరీశంకర్, సంక్షేమ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, సభ్య కార్యదర్శి అనితా రాజేంద్ర, బీసీ కార్పొరేషన్ ఎండీ అలోక్‌కుమార్, మహాత్మపూలే గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి మల్లయ్య భట్టుతో సమావేశమయ్యారు. సుదీర్ఘంగా సాగిన ఇరు కమిషన్ల సమావేశంలో రాష్ట్రంలో అమలు జరుగుతున్న సంక్షేమ పథకాలు, లబ్దిదారుల వివరాలు, బీసీల సామాజిక ఆర్ధిక స్థితిగతులపై వివరాలు అందించారు. తెలంగాణ రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాల వివరాలు, విద్యా ఉద్యోగాల్లో బీసీల రిజర్వేషన్ల అమలు తీరు తెన్నులు, ఇతర సమస్యలపై జాతీయ బీసీ కమిషన్ ఆరా తీసింది. కళ్యాణలక్ష్మీ పథకం ద్వారా బీసీ వర్గాలకు చెందిన నూతన జంటలకు లక్ష 116 రూపాయిల ఆర్ధిక సహాయానికి సంమంధించిన వివరాలు, బీసీ విద్యార్థుల విదేశీ చదువులకు సంబంధించి 20 లక్షలకు పైగా ఆర్థిక సాయం తదితర పథకాలను రాష్ట్ర అధికారులు వివరించారు.