క్రీడాభూమి

వరల్డ్ కప్ క్రికెట్ నుంచి ఇండియా ఔట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాపార్డర్ విఫలమైతే, ఆ తర్వాత టీమిండియాను ఆదుకోవడానికి ఎవరూ లేరన్న వాదన నిజమేనని మాంచెస్టర్‌లో జరిగిన ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్ సెమీ ఫైనల్లో మరోసారి రుజువైంది. వాతావరణం ఒకవైపు, బ్యాట్స్‌మెన్ నిర్లక్ష్యం మరోవైపు భారత అభిమానుల ఆశలపై నీళ్లు చల్లాయి. మంగళవారం వర్షం కారణంగా నిలిచిపోయిన సెమీ ఫైనల్‌ను బుధవారం కొనసాగించగా, కివీస్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 239 పరుగులకు ఆలౌటైంది. అనంతరం భారత్ 49.3 ఓవర్లలో 221 పరుగులకే పరిమితమైంది. మిడిల్ ఆర్డర్‌లో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా పోరాడినప్పటికీ ఫలితం లేకపోయింది. లక్ష్య ఛేదనలో భారత్ తడబడగా అందరి అంచనాలను తల్లికిందులు చేస్తూ న్యూజిలాండ్ ఫైనల్‌కు దూసుకెళ్లింది.

చిత్రం... కీలకమైన మూడు వికెట్లు తీసి టీమ్ ఇండియా పతనాన్ని శాసించిన మాట్ హెన్రీని అభినందిస్తున్న న్యూజిలాండ్ క్రికెట్ టీమ్ సభ్యులు