AADIVAVRAM - Others
ఈదురు గాలి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 13 July 2019
-డా.ఎన్.గోపి
మనస్సులోంచి వీచే
ఈదురుగాలికి
అడ్డూ ఆపూ లేదు
క్షణమైనా తెరిపిలేని
కల్లోల హోరు.
చెట్ల మెడలు వంచాలని
ఒకటే దాడి,
చెట్లు ఊరుకుంటాయా
ఆకులతో అరుస్తూ
గీపెడుతుంటాయి,
కొమ్మలతో దాని రెక్కలు విరిచి
కిందికి తోసేస్తుంటాయి.
ఒళ్లు దులుపుకొని
కొండల వైపు
పరుగులు తీస్తుంది గాలి.
చుట్టుముట్టిన గాలితోపులకు
చెక్కుచెదరదు కొండ,
అక్కడా జారిపడుతుంది గాలి
పోలేక పోలేక పోతున్న
వేసవి కార్చిన
కన్నీళ్లలాగుంది వర్షం!
క్షణాల్లో గాలి
దానిని తరిమికొట్టేసింది.
పిచ్చి దయ్యంలా
జడలు విరబోసుకొని తిరిగే
ఈ గాలికి మూలమెక్కడ!
మనిషి వైకృత క్రీడలో
భాగం కాదు గదా ఇది!
దీని వేళ్లను నిశే్శషంగా నరికెయ్యాలి
అప్పుడు గాని
కలల పుప్పొడి లాంటి
అలల గాలి వీయదు
అస్తవ్యస్త వాతావరణంలో
కాస్త కవిత్వమే మందు.