తెలంగాణ
తెలంగాణ స్టార్టప్లకు జాతీయస్థాయి ప్రశంసలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 7 September 2019
హైదరాబాద్, సెప్టెంబర్ 6: తెలంగాణ ప్రభుత్వ స్టార్టప్ నమూనాలకు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుతున్నాయని ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఐటీ విధానాలకు ఇప్పటికే దేశ, విదేశాల్లో ప్రశంసలు లభించాయన్నారు. తెలంగాణ ఐటీ విధానాలను ఇతర రాష్ట్రాలు అనుసరించాలని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన యూకే సిన్హా కమిటీ సిఫారసు చేసిందని జయేశ్ రంజన్ గుర్తు చేశారు. ముఖ్యంగా సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల దీర్ఘకాలిక ఆర్థిక, రుణ సంబంధిత సమస్యలు, పరిష్కారాలకు సంబంధించిన తమ స్టార్టప్ నమూనాలు ఉపయోగపడుతున్నాయని వివరించారు.