తెలంగాణ

రైతు సమస్యలు పట్టవా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 6: రాష్ట్రంలో రైతాంగం యూరియా కోసం పడికాపులు కాస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా నిద్రపోతున్నారని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎంకు రాసిన బహిరంగ లేఖను రమణ మీడియాకు విడుదల చేశారు. రాష్ట్రంలో వర్షాలు పడటంతో పంటల సాగుకు యూరియా కోసం రైతులు రేయింబవళ్లు ప్రభుత్వ కార్యాలయాల ఎదుట పడిగాపులు కాస్తున్న ఉదంతాలు ముఖ్యమంత్రికి కన్పించడంలేదా? అని రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా దుబ్బాక మండలంలో రైతు ఎల్లయ్య క్యూ లైన్‌లో నిల్చోని చనిపోతే రైతు మృతి యాదృచ్ఛికమని మంత్రి ప్రకటన చేయడం సిగ్గుచేటన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి రైతుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. యూరియా కోసం రైతులు ఆందోళన చెందుతుంటే యూరియా సమస్యే లేదంటూ ప్రభుత్వం ప్రకటనలు చేయడం దారుణమన్నారు. ప్రభుత్వం తక్షణం యూరియాను అందుబాటులోకి తెచ్చి రైతులను ఆదుకోవాలని రమణ డిమాండ్ చేశారు.