తెలంగాణ

కేసీఆర్ కొత్త జట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 8: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకు ఆదివారం జరిగింది. కేసీఆర్ కొత్త జట్టు వచ్చేసింది. రాష్ట్ర గవర్నర్‌గా ఉదయం ప్రమాణ స్వీకారం చేసిన తమిళిసై సాయంత్రం నాలుగు గంటలకు రాజ్‌భవన్‌లో ఆరుగురు మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో మంత్రిమండలిలో ఖాళీగా ఉన్న స్థానాలన్నీ భర్తీ అయ్యాయి. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో తొలిసారిగా ఇద్దరు మహిళలకు మంత్రివర్గంలో స్థానం లభించింది. కాగా అందరు ఉహించినట్టుగానే మంత్రివర్గ విస్తరణలో మాజీ మంత్రులు తన్నీర్ హరీశ్‌రావు, కల్వకుంట్ల తారక రామారావు, సబితా ఇంద్రారెడ్డికి స్థానం లభించగా తొలిసారి అవకాశం దక్కిన వారిలో కరీంనగర్ జిల్లాకు చెందిన గంగుల కమలాకర్, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన సత్యవతి రాథోడ్, ఖమ్మం జిల్లాకు చెందిన పువ్వాడ అజయ్ కుమార్ ఉన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన ఆరుగురు మంత్రులకూ ఆ కార్యక్రమం పూర్తికాగానే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శాఖలు కేటాయించారు. మంత్రివర్గంలో కీలకమైన ఆర్థికశాఖను తన్నీర్ హరీశ్‌రావుకు కేటాయించారు. గతంలో నీటిపారుదల వంటి కీలకశాఖను నిర్వహించిన హరీశ్ రావుకు అంతే కీలకమైన ఆర్థిక శాఖను కేటాయించడం విశేషం కాగా, సోమవారం శాసనసభలో ఆర్థికశాఖ మంత్రి హోదాలో ఆయనే బడ్జెట్ ప్రవేశపెట్టనుండటం మరో విశేషం. కాగా టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావుకు
గతంలో నిర్వహించిన మున్సిపల్, ఐటీ, పరిశ్రమలశాఖలనే తిరిగి కేటాయించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హోంశాఖను నిర్వహించిన సబితా ఇంద్రారెడ్డికి విద్యాశాఖను కేటాయించారు. ఈ శాఖను నిర్వహిస్తున్న జీ జగదీశ్‌రెడ్డికి శాఖను మార్చి విద్యుత్ శాఖను కేటాయించారు. విద్యుత్‌శాఖ ఇప్పటి వరకు ముఖ్యమంత్రి వద్దనే ఉంది. ఇలా ఉండగా మంత్రివర్గ విస్తరణలో శాఖ మారింది ఒక్క జగదీశ్‌రెడ్డికి మాత్రమే. మిగిలిన మంత్రులకు ఇతర మంత్రుల వద్ద అదనంగా ఉన్న శాఖలనే కేటాయించారు. పువ్వాడ అజయ్‌కుమార్‌కు రవాణాశాఖను, సత్యవతి రాథోడ్‌కు గిరిజన సంక్షేమం, మహిళా, శిశు సంక్షేమశాఖలు, గంగుల కమలాకర్‌కు బీసీ సంక్షేమం,పౌరసరఫరాల శాఖలు కేటాయించారు. మంత్రి హరీశ్‌రావుకు కేటాయించిన ఆర్థికశాఖను ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కేసీఆరే తన వద్ద ఉంచుకున్నారు. అలాగే కేటీఆర్‌కు కేటాయించిన మున్సిపల్, ఐటీ, పరిశ్రమలశాఖలు కూడా సీఎం వద్దనే ఉండగా తాజాగా వీటిని గతంలో నిర్వహించిన కేటీఆర్‌కే కేటాయించారు. రవాణాశాఖను పువ్వాడ అజయ్‌కుమార్‌కు కేటాయించగా ఈ శాఖను ఇప్పటివరకు వేముల ప్రశాంత్‌రెడ్డి నిర్వహించారు. రోడ్లు, భవనాలు, శాసనసభా వ్యవహారాలు, రవాణాశాఖ కూడా ప్రశాంత్‌రెడ్డి వద్దనే ఉండటంతో అందులో రవాణాశాఖను పువ్వాడకు కేటాయించారు. గంగుల కమలాకర్‌కు బీసీ సంక్షేమంతో పాటు పౌరసరఫరాలశాఖను కేటాయించారు. ఇప్పటి వరకు అన్ని సంక్షేమ శాఖలను మంత్రి కొప్పుల ఈశ్వరే నిర్వహించగా ఇందులో బీసీ సంక్షేమాన్ని గంగుల కమలాకర్‌కు అప్పగించారు. అలాగే వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి వద్ద ఉన్న పౌరసరఫరాలశాఖను కూడా గంగులకు కేటాయించారు. మరో మంత్రి సత్యవతి రాథోడ్‌కు ఎస్టీ సంక్షేమంతో పాటు మహిళా, శిశు సంక్షేమశాఖలను అప్పగించారు. ఈ శాఖలను కూడా ఇప్పటి వరకు కొప్పుల ఈశ్వరే నిర్వహించారు. రాజ్‌భవన్‌లో జరిగిన మంత్రివర్గ ప్రమాణ స్వీకారం అత్యంత వైభవంగా జరిగింది. ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలుపగా మంత్రులు పాదాభివందనంతో ధన్యవాదాలు తెలిపారు. ప్రమాణ స్వీకారం చేసిన ఆరుగురిలో ఒక్క కేటీఆర్ మాత్రమే పవిత్ర హృదయంతో ప్రమాణం చేయగా, మిగిలిన ఐదుగురు దైవసాక్షిగా ప్రమాణం చేయడం విశేషం. మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్ నాయకులు పెద్ద ఎత్తున తరలి రావడంతో రాజ్‌భవన్ రోడ్ కిక్కిరిసిపోయింది.
*
మంత్రులు.. శాఖలు
హరీశ్‌రావు ఆర్థిక శాఖ
తారక రామారావు మున్సిపల్, ఐటీ,
పరిశ్రమలు
సబితా ఇంద్రారెడ్డి విద్యా శాఖ
గంగుల కమలాకర్ బీసీ సంక్షేమం,
పౌర సరఫరాలు
సత్యవతి రాథోడ్ గిరిజన, మహిళా,
శిశు సంక్షేమం1
పువ్వాడ అజయ్‌కుమార్ రవాణా శాఖ
మంత్రి జగదీశ్‌రెడ్డి విద్యుత్ శాఖ
చిత్రం...రాష్ట్ర మంత్రులతో కొలువుదీరిన ముఖ్యమంత్రి కేసీఆర్. చిత్రంలో నూతన గవర్నర్ తమిళిసై