తెలంగాణ

పర్యాటకంలో తెలంగాణ జోరు.. ఏపీ బేజారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయపురిసౌత్, సెప్టెంబర్ 8: నాగార్జునసాగర్ జలాశయానికి పూర్తిస్థాయిలో వరద నీరు చేరటంతో తెలంగాణ పర్యాటక శాఖ పర్యాటకుల కోసం సాగర్ - శ్రీశైలం లాంచీ సర్వీసు ప్రారంభించి రెండు రోజులు గడుస్తున్నా, ఏపీ పర్యాటక శాఖ ఇంకా వెనుకంజలోనే ఉండిపోయింది. అనుమతులు లేవంటూ సాగర్ - శ్రీశైలం లాంచీలను ఇంతవరకూ రాష్ట్ర పర్యాటక శాఖ ప్రారంభించక పోవటంపై పర్యాటకుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాగర్ జలాశయం ఒక్కటే అయినా ప్రాజెక్టుకు ఒక పక్క తెలంగాణ, మరోపక్క ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖల ఆధ్వర్యంలో లాంచీ స్టేషన్లు ఉన్నాయి. సాగర్ నీటిమట్టం 565 అడుగులు దాటాక సాగర్ నుండి శ్రీశైలానికి లాంచీలు నడిపే అవకాశం లభిస్తుంది. నీటిమట్టం పూర్తిస్థాయిలో ఉన్నా సాగర్ నుండి శ్రీశైలానికి లాంచీలు నడిపేందుకు ఏపీ పర్యాటక శాఖాధికారులు తగిన చర్యలు తీసుకోలేదు. తెలంగాణ పర్యాటక శాఖ లాంచీ సర్వీసును శనివారం సాయంత్రం ఎమ్మెల్యే నోముల నరసింహయ్య జెండా ఊపి ప్రారంభించారు. ఏపీ పర్యాటక శాఖ మాత్రం అటవీ శాఖ అనుమతులు రాలేదనే కారణంతో లాంచీలను ప్రారంభించలేదు. తెలంగాణ పర్యాటక శాఖను ప్రోత్సహించేలా ఏపీ పర్యాటక శాఖ వ్యవహరిస్తున్నట్లు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం విజయపురిసౌత్‌లో పర్యాటకంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయని పర్యాటక శాఖకు చెందిన విశ్రాంత ఉద్యోగులు వాపోతున్నారు. విజయపురిసౌత్ నుండి కూడా సాగర్ - శ్రీశైలం లాంచీ నడిపేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

చిత్రం... సాగర్ - శ్రీశైలం లాంచీని ప్రారంభిస్తున్న తెలంగాణ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య