తెలంగాణ

గోదారి వరదల్లో చిక్కుకున్న గొర్రెల కాపరులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహదేవ్‌పూర్, సెప్టెంబర్ 8: తెలంగాణ, మహారాష్టలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి, ప్రాణహిత నదులు పొంగిపొర్లడంతో కాళేశ్వరం వద్ద ఉన్న గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్‌పూర్ మండలంలోని లక్ష్మీ బ్యారేజీ (మేడిగడ్డ) 82 గేట్లు శనివారం అర్ధరాత్రి ఎత్తివేయడంతో పంకెన సమీపంలోని గొర్రెలను మేపడానికి వెళ్లిన పశువుల కాపరులు ముగ్గురితో పాటు 800 గొర్రెలు నదీ ప్రవాహంలో చిక్కుకున్నాయి. పంకెన సమీపంలోని చిన్న ద్వీపకల్పంగా ఉన్న గత వారం నుండి పంకెన గ్రామానికి చెందిన మారవేని కొమురయ్య, పర్వతాలు, భట్టి సతీష్ గొర్ల కాపరులు గొర్రెలను ఆ ద్వీపకల్పంలో మేపుతున్నారు. అనుకోకుండా లక్ష్మీ బ్యారేజీ గేట్లు ఎత్తివేయడంతో నీరు ఆ ద్వీపకల్పాన్ని కమ్మివేశాయి. దీంతో అర్ధరాత్రి బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీయగా ఉదయానే్న స్థానిక గ్రామస్థులకు అందులో ఉన్న గొర్రెలకాపరి భట్టి సతీష్ ఒడ్డుకు చేరి సమాచారం అందివ్వడంతో అప్రమత్తమైన గ్రామస్థులు పోలీసు శాఖ, రెవెన్యూ శాఖలకు విషయాన్ని తెలియజేశారు. దీంతో అప్రమత్తమైన కాటారం ఏఎస్పీ సాయిచైతన్య రంగంలోకి దిగి స్థానిక పోలీసులతో పాటు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందానికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి ఏఎస్పీ సాయిచైతన్య చేరుకుని ముందస్తుగా ఇంజన్ పడవలతో గొర్రెలకాపరులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అనంతరం ఆ ద్వీపకల్పంలో చిక్కుకున్న గొర్రెలను ఆ బోట్ల ద్వారా వాటిని కూడా ఒడ్డుకు చేర్చారు.
స్థానిక ఎంఆర్‌వో మంజుల, సీఐ నర్సయ్య, పలిమెల ఎస్సై తిరుపతిరెడ్డి, పలు పార్టీల నాయకులు గుడాల శ్రీనివాస్, గుండెబోయిన వెంకటస్వామి, స్థానికులు రమేష్, సంజీవని సేవా సమితి సభ్యులు ఇందులో పాల్గొన్నారు.

చిత్రాలు... బోట్ల ద్వారా గొర్రెలను ఒడ్డుకు తీసుకొస్తున్న దృశ్యం
* పంకెన గోదావరి ఒడ్డున పర్యవేక్షిస్తున్న ఏఎస్పీ సాయిచైతన్య