తెలంగాణ

దేశంలోనే అగ్రగామి రాష్ట్రం:కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈసందర్భంగా పూర్తిస్థాయి బడ్జెట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ ఆయన ప్రసంగించారు. ఐదేళ్లలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందని, దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంటూ అగ్రగామిగా నిలిచిందని అన్నారు. మొత్తం బడ్జెట్ రూ.1,46,492.6 కోట్లుగా పేర్కొన్నారు. ఇందులో వ్యయం 1,11,055 కోట్లు, మూలధనం రూ. 17,274.67 కోట్లు, మిగులు రూ. 2,044.08 కోట్లు, రాష్ట్ర ఆర్థిక లోటు రూ. 24,081.74 కోట్లు పొందుపరిచారు. ఐదేళ్లలో రాష్ట్ర స్థూలజాతీయోత్పత్తి రెట్టింపు అయిందని తెలిపారు. ఐదేళ్లలో పెట్టుబడి వ్యయం ఆరురెట్లు పెరిగిందని తెలిపారు. ఈ కాలంలో 6.3శాతం వృద్ధిరేటును సాధించామని చెప్పారు. బడ్జెట్‌లో సాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఉంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు. పేదలకు ఆరోగ్య భద్రత కల్పించడమే తమ లక్ష్యమని కేసీఆర్ స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీకి రూ.1,336కోట్లు కేటాయించామని.. అన్ని శాఖల్లో బకాయిల చెల్లింపులకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణలో సగటు ఆదాయ వృద్ధి రేటు 21.49 శాతం అని.. సమర్ధవంతమైన ఆర్థిక నిర్వహణతో అద్భుతాలు వస్తాయని కేసీఆర్ స్పష్టం చేశారు. నాణ్యమైన విద్యుత్‌ 24 గంటల పాటు ఇవ్వడంతో... పారిశ్రామిక, వ్యవసాయరంగం పునరుత్తేజం సాధించాయని తెలిపారు. రైతుబంధు పథకం వ్యవసాయరంగానికి తోడ్పాటునందించిందని కేసీఆర్ పేర్కొన్నారు. బడ్జెట్ ప్రసంగం ముగిసిన తరువాత స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి సభను శనివారానికి వాయిదా వేశారు.