తెలంగాణ

మంత్రి కార్యక్రమంలో రైతు ఆత్మహత్యా యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాల్కొండ, అక్టోబర్ 5: ముప్పై రోజుల ప్రణాళికలో భాగంగా చిట్టాపూర్ గ్రామ పర్యటనకు వచ్చిన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పర్యటనలో అదే గ్రామానికి చెందిన కండెల రఘువీర్ అనే రైతు ఆత్మహత్యకు ప్రయత్నించడం కొద్దిసేపు కలకలం సృష్టించింది. గ్రామంలో పర్యటిస్తున్న మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ర్యాలీగా వస్తుండగా, రఘువీర్ తనకు సంబంధించిన వ్యవసాయ భూమిని రెవెన్యూ అధికారులు ఇతరుల పేరిట పట్టా చేసి ఇచ్చారని, ఈ విషయాన్ని ఎన్నిసార్లు రెవెన్యూ అధికారులకు మొరపెట్టుకున్నా, ఎవరు కూడా తనకు న్యాయం చేయడం లేదని, తన గోడు పట్టించుకునే వారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. అతనిని గమనించిన గ్రామస్తులు, పోలీసులు వెంటనే అతని వద్ద నుండి కిరోసిన్ బాటిల్, అగ్గిపెట్టెను స్వాధీనం చేసుకున్నారు. తనకు న్యాయం జరిగేవరకు కదిలేది లేదని రఘువీర్ రోడ్డుపై బైఠాయించగా, బాల్కొండ ఎస్‌ఐ శ్రీహరి తన సిబ్బందితో స్పందించి వెంటనే రఘువీర్‌ను బలవంతంగా పక్కకు తప్పించి ఆసుపత్రికి తరలించారు. అయితే రఘువీర్‌కు చెందిన భూమిని రెవెన్యూ అధికారులు ఇతరులకు పట్టా చేయించి ఇవ్వడం వాస్తవమేనని, ఈ విషయమై తనకు న్యాయం చేయాలని రఘువీర్ అధికారుల చుట్టూ తిరిగినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఈ చర్యకు పాల్పడ్డాడని స్థానికులు పేర్కొన్నారు.