తెలంగాణ

వేటు తప్పదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మె వద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన సూచనలను ధిక్కరించి సమ్మెకు దిగిన 52 వేల మంది కార్మికుల భవిష్యత్తు ఆదివారం తెలనున్నది. సమ్మెపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న సీఎం కేసీఆర్ ఆదివారం కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో, ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అందరూ ఎదురుచూస్తున్నారు. కేసీఆర్ స్వయంగా ప్రకటన చేయనుండడంతో, సమ్మె కొనసాగుతుందా
లేక విరమించుకుంటారా అన్నది ఆసక్తి రేపుతున్నది. సమ్మెకు సీపీఐ మినహా అన్ని ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు సంఘీభావం వ్యక్తం చేశాయి. ఇలావుంటే, ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీలు ఇచ్చిన పిలుపుమేరకు శుక్రవారం అర్థరాత్రి ప్రారంభమైన సమ్మె విజయవంతమైంది. కాగా, ప్రభుత్వం ఇచ్చిన గడువు దాటడంతో డ్యూటీలో చేరని కార్మికులపై ఇక బర్తరఫ్ వేటు తప్పదని ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరించింది. ఒకవైపుసర్కారు హెచ్చరికలు, మరోపక్క కార్మికుల పట్టుదల మధ్య, రాష్ట్ర వ్యాప్తంగా ఉత్క్ఠ పరిస్థితి నెలకొంది. దసరా సెలవులకు వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల్లో ఆందోళన పెరుగుతోంది.
మొదటి రోజు సమ్మె కొన్ని చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా జరిగింది. పోలీసులు రంగప్రవేశంతో వివిధ డీపోల వద్ద ఘర్షణలకు తెరపడింది. శనివారం బస్సు డిపోల్లో నుంచి కొద్దిపాటి బస్సులను పోలీస్ బలగాలతో బయటికి తీసుకొచ్చి, సర్వీసులను కొనసాగించే ప్రయత్నం చేశారు. అయితే, రద్దీ ఎక్కువగా ఉండడంతో, ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు. మరోవైపు బస్టాండుల్లోకి ప్రైవేటు వాహనాలను అధికారులు అనుమతించారు. దీనితో చాలా ప్రాంతాల్లో బస్టాండులన్నీ ప్రైవేటు వాహనాలతోనే నిండిపోయాయి. ప్రయాణికులకు కొంతలో కొంత ఊరట లభించింది.
ఇలావుంటే, సమ్మెలో పాల్గొన్న కార్మికులకు సెప్టెంబర్ నెల జీతాలు పడలేదు. సమ్మెకు దిగడం వల్లే జీతాలు రాలేదన్న ఆందోళన వారిలో స్పష్టంగా కనిపిస్తున్నది. ఆదివారం సీఎం కేసీఆర్ తీసుకోబోయే నిర్ణయంపై వారంతా ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.
ప్రత్యేక రైళ్లు
ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రయాణికులు పడుతున్న అవస్థలపై రైల్వే అధికారులు స్పందించారు. హైదరాబాద్ నుంచి తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటు రాయలసీమ కర్నూల్‌కు వెళ్ళాల్సిన ప్రయాణికుల కోసం రిజర్వేషన్ లేని జనసాధారణ్ రైళ్లను నడుపుతున్నారు. ఆర్టీసీ బస్సులు లేకపోయినా, ప్రత్యేక రైలు సర్వీసులు అందుబాటులోకి రావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఊళ్లకు వెళ్లేవారు రైల్వే స్టేషన్లకు పరుగులు తీశారు. అంతకు ముందు, శుక్రవారం రాత్రి నుంచి హైదరాబాద్ మహాత్మా గాంధీ బస్టాండ్, జూబ్లీబస్టాండ్‌ల్లోనే ప్రయాణికులు నిద్రపోయారు.
కాగా. సమ్మె ప్రభావాన్ని తెలుసుకోవడానికి ఆర్టీసీ జేఎసీ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజరెడ్డి, ముదిరాజ్ హనుమంత్ తదితరులు శనివారం ఉదయం హైదరాబాద్ ప్రధాన బస్టాండ్ మహాత్మా గాంధీ బస్టాండ్‌కు వెళ్లారు. అక్కడ సమ్మె చేస్తున్న కార్మికులతో మాట్లాడారు. సమ్మె పట్ల ప్రభుత్వ నిరంకుశ వైఖరి అవలంభిస్తోందని జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మెను భగ్నం చేయడానికి ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. సమ్మె విజయవంతమైందని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని వారు డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా సీఎం డెడ్‌లైన్లు ఇవ్వడం ఏమిటని వారు నిలదీశారు. కేసీఆర్ గత ఎన్నికల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని ఇచ్చిన హామీని వారు గుర్తుచేశారు. బంగారు తెలంగాణ అంటే ఉన్న ఉద్యోగులను తొలగించడమా అంటూ వారు ధ్వజమెత్తారు. డిమాండ్లను తీర్చేవరకూ సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. సమ్మెను మరింత ఉధృతం చేయడానకి జేఎసీ ఆదివారం నుంచి వివిధ రకాలుగా ఆందోళనలు చేపడుతుందన్నారు. రాస్తారోకో, ముట్టడి, ధర్నాలు, అధికారులు కార్యాలయాలకు పోకుండా దిగ్బంధం వంటి చర్యలకు దిగుతామని స్పష్టం చేశారు. కాగా, శనివారం సాయంత్ర 6 గంటలలోపుఆర్టీసీ కార్మికులు డ్యూటీలో చేరాలన్న ప్రభుత్వం హెచ్చరికలను కార్మిక సంఘాలు పట్టిచ్చుకోలేదు. తెలంగాణలో ఎక్కడా కార్మికులు డ్యూటీలోకి హాజరైనట్టు సమాచారం లేదు. ఈ కారణంగా, కార్మికులపై ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాలని యోచిస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, వేతన సవరణ, ఉద్యోగుల భద్రత వంటి 26 డిమాండ్లతో జేఏసీ సమ్మెకు దిగిన విషయం తెలిసిందే.
బస్సులను అందుబాటులోకి తెచ్చాం
*ఆర్టీసీ ఏండీ సునీల్ శర్మ వెల్లడి
ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మె పిలుపుతో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకున్నామని ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50 శాతం పైగా బస్సులు నడిపినట్లు ఆయన తెలిపారు. ఆదివారం నాటికి 9 నుంచి 10 వేల బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. డ్రైవర్లు, కండక్టర్లు, మెకానికల్‌ను భర్తీ చేస్తున్నామని, వారి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని డ్యూటీలోకి తీసుకుంటామన్నారు. కొత్తగా తీసుకున్న వారికి డ్రైవింగ్ శిక్షణ కూడా ఇస్తామన్నారు.