తెలంగాణ

కాంగ్రెస్‌ను గెలిపిస్తేనే ప్రజాస్వామ్య మనుగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, అక్టోబర్ 5: పోరాటాలు, బలిదానలతో సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ నియంత పాలన కొనసాగుతోందని, త్వరలో జరిగే హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌పార్టీని గెలిపిస్తేనే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మనుగడ సాధిస్తుందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్తూ శనివారం జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్ధతు ప్రకటించారు. అనంతరం మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉద్యమనేత అయిన కేసీఆర్ చెప్పిన మాయ మాటాలు నమ్మి ప్రజలు అధికారమిస్తే నియంతగా మారి కుటుంబ పాలన సాగిస్తూ ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ ఖునీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్ పాలనలో అర్భాటాలు, అట్టహాసలే తప్ప రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఏమిలేదన్నారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చి అద్భుతాలు జరిగాయాంటూ గొప్పలు చెప్పుకుంటున్నాడని మండిపడ్డారు. హుజూర్‌నగర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే ఇప్పుడు ఉన్న అప్పులను రెట్టింపు చేస్తారే తప్ప చేసేది ఏమిలేదన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హమీలను అమలు చేయకుండా టీఆర్‌ఎస్ నేతలు ఏమొహం పెట్టుకొని ప్రజలను ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ నియంతృత్వ దోరణే ఆర్టీసీ సమ్మెకు కారణమని ఆరోపించారు. నష్టాలను బూచిగా చూపి ఆర్టీసీని ప్రైవేటుపరం చేసేందుకు కేసీఆర్ కుట్రలు చేస్తున్నాడని అందులో భాగంగానే సంస్థను నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తున్నారన్నారు. తెలంగాణ సాధన ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు కీలకపాత్ర పోషించారని, వారి న్యాయమైన డిమాండ్లను సానుకూల ధృక్పదంతో పరిష్కారించాల్సి ఉండగా అందుకు భిన్నంగా తక్షణమే విధుల్లో చేరకపోతే ఉద్యోగాల నుండి తొలగిస్తామని హెచ్చరించడం నియంతృత్వ ధోరణికి నిదర్శనమన్నారు. తక్షణమే ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి సమ్మెను విరమింపజేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఎపీలో మాదిరిగా ఇక్కడ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసిన కాంగ్రెస్ అభ్యర్ధి పద్మావతిఉత్తమ్ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. నిన్న హుజూర్‌నగర్‌లో జరిగిన కేటీఆర్ రోడ్‌షో పేలవంగా సాగిందన్నారు. నియంత పాలన కొనసాగిస్తున్న కేసీఆర్‌కు హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పి ప్రశ్నించే గొంతుకలుగా నిలవనున్నారన్నారు. ఈ విలేకరుల సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మహేశ్ కుమార్‌గౌడ్, డీసీసీ అధ్యక్షుడు చెవిటి జవెంకన్నయాదవ్, టీపీసీసీ అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వరరావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు అంజద్‌ఆలీ, నాయకులు జన్నపాల ఎల్లయ్య, వీరన్న నాయక్, వడ్డె ఎల్లయ్య, చెంచెల శ్రీను, పందిరి వెంకన్న, పిడమర్తి మల్లయ్య, మద్ది శ్రీనివాస్‌యాదవ్, దొంతిరెడ్డి సైదిరెడ్డి, పిడమర్తి కల్యాణ్, నరేందర్‌నాయుడు, సాయినేత, వాసు తదితరులు పాల్గొన్నారు.