తెలంగాణ

ర్యాలీలు, ధర్నాలు, అరెస్టుల పర్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, అక్టోబర్ 5: ఆర్టీసీ కార్మికుల ఆందోళనతో ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలు అట్టుడికిపోయాయి. ప్రభుత్వం ‘ఎస్మా’ చట్టం ప్రయోగానికైనా సిద్ధమంటూ తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులను నడిపేందుకు నిర్ణయించి, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు కూడా చేసింది. సమ్మెకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టిన యంత్రాంగం తాత్కాలిక కార్మికులను విధుల్లోకి తీసుకుని కొన్ని బస్సులను నడిపింది. తెల్లవారు జాము నుంచి బస్సులను ప్రైవేటు వ్యక్తులతో నడిపేందుకు సిద్ధమవటంతో కార్మికులు, కార్మిక సంఘాల నేతలు పలు డిపోల వద్ద బస్సులను అడ్డుకున్నారు. డిపోల నుంచి బస్సులను బయటకు రానీయకుండా ఆందోళనకు దిగారు. ఖమ్మం, కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, సత్తుపల్లి, మధిర పట్టణాల్లో కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగటంతో ఉభయ జిల్లాలు అట్టుడికిపోయాయి. కాంగ్రెస్, తెలుగుదేశం, సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ పార్టీలతోపాటు అనుబంధ కార్మిక సంఘాలు సైతం ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలిపాయి. అనేకచోట్ల వారిని అరెస్టుచేశారు. సమ్మెకు మద్దతుగా ఐఎఫ్‌టీయు ఆధ్వర్యంలో ఇల్లందులో నేతలు ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించటంతో పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు ప్రభుత్వం తాత్కాలిక సిబ్బందితో కొన్ని బస్సులను నడిపింది. ఆదివారం విధులకు హాజరుకాని ఆర్టీసీ సిబ్బందిని పూర్తిగా తొలగిస్తామని రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రకటించడంతో కార్మికులు ఆదివారం నుండి తమ ఆందోళనను మరింత ఉధృతం చేయనున్నారు. మరోపక్క డ్రైవింగ్ లైసెన్సు కలిగిన వారు ఉద్యోగం కోసం డిపోల వద్దకు చేరుకుంటున్నారు. ఆదివారం నుంచి పూర్తిస్థాయి బస్సులు నడిపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆర్‌టీఓ ఆధ్వర్యంలో పాఠశాలల బస్సులను కూడా తిప్పేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అలాగే ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సమీపంలో ఉండటంతో ఆ ప్రాంతాల నుండి ఎక్కువగా బస్సులు నడుపుతున్నారు. మరో వైపు చాలా మంది ప్రయాణికులు ప్రైవేటు వాహనాలపై ఆధారపడాల్సి వచ్చింది. భద్రాచలం, కొత్తగూడెం, ఖమ్మం, అశ్వారావుపేట, హైద్రాబాద్ పట్టణాల వైపు ప్రయాణించేందుకు బయలుదేరిన ప్రయాణికుల నుంచి ప్రైవేటు వాహనాల నిర్వాహకులు అసలు ధర కంటే మూడు రెట్లు అధికంగా ఛార్జీలు వసూలు చేశారు. అయినా తప్పని పరిస్థితుల్లో ప్రజలుః పలు ఇబ్బందులు పడుతూనే తమ గమ్యస్థానాలకు చేరుకోవాల్సి వచ్చింది.