తెలంగాణ

హుజూర్‌నగర్ తీర్పుతో నిరంకుశ పాలనకు పతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేరేడుచర్ల, అక్టోబర్ 17: హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో ప్రజలిచ్చే తీర్పుతో ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంకుశ పాలనకు అంతం ప్రారంభమవుతుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆయన గురువారం నేరేడుచర్లలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్‌తో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ హుజూర్‌నగర్ ఉప ఎన్నిక తెలంగాణ భవిష్యత్తుపై ఆధారపడి ఉందన్నారు. హుజూర్‌నగర్ నియోజకవర్గంలో ఆరు సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి పనులు చేయకపోగా మరోసారి మాయమాటలు చెప్పి ఎన్నికలకు వచ్చారని తెలిపారు. తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రికి కనువిప్పు కలిగించాలన్నారు. రైతుల రుణమాఫీ చేయాలని, విద్యార్ధులకు ఫీజు రీయంబర్స్‌మెంట్ విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని, డబుల్‌బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేయాలని, కేబినెట్‌లో మాదిగలకు అవకాశం కల్పించాలని, దళితులకు, గిరిజనులకు మూడెకరాల భూపంపిణీ చేయాలని, గిరిజనులకు, ముస్లింలకు 12శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. హుజూర్‌నగర్ నియోజకవర్గంలో అరాచకాలు జరగకుండా ప్రశాంతంగా ఉండేవిధంగా ఓటర్లు తీర్పు ఇవ్వాలని కోరారు. భూదందాలు, ఇసుక మాఫియాను, పోలీస్ సెటిల్‌మెంట్లను చేసేవారికి మద్దతు ఇవ్వవద్దన్నారు. నీతి, నిజాయితీ, ధర్మం, చట్టాలను గౌరవించేవారికి అరాచకాలు, అవినీతి, దౌర్జన్యాలు, చట్టవ్యతిరేకానికి పాల్పడే వారికి మధ్య పోటీ జరుగుతుందన్నారు. టీఆర్‌ఎస్‌కు పోటీ ఇచ్చే కాంగ్రెస్ పార్టీకి ఇతర పార్టీల వారు మద్దతు ప్రకటించాలని కోరారు. టీఆర్‌ఎస్‌ను ఓడించే శక్తి ఉన్న కాంగ్రెస్‌కు మద్దతు తెలపాలని కోరారు. ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని, 19న జరిగే బంద్‌ను జయప్రదం చేయాలని కోరారు.