తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిచ్‌పల్లి రూరల్, అక్టోబర్ 17: నిజామాబాద్ జిల్ల్లా డిచ్‌పల్లి మండల కేంద్రంలోని టీఎస్‌ఎస్‌పీ 7వ పోలీస్ బెటాలియన్ సమీపంలో 44వ నెంబర్ జాతీయ రహదారిపై గురువారం ఉదయం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో నిజామాబాద్‌కు చెందిన వంగల రవీందర్(48), కానుగు గంగవ్వ(65) సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. పోలీసుల తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్ నగరానికి చెందిన కానుగు భూమన్న తల్లి గంగవ్వ డిచ్‌పల్లి మండలం గన్నారంలో బంధువుల ఇంటికి ఇటీవలే వచ్చింది. దీంతో తన తల్లిని తిరిగి ఇంటికి తీసుకెళ్లేందుకు భూమన్న గురువారం ఉదయం తన ఇంట్లోనే అద్దెకు ఉండే చిక్కడపల్లి గంగాధర్, వంగల రవీందర్, ఇంటి పక్కనే ఉండే రాములుతో కలిసి కారులో గన్నారం గ్రామంలోని బంధువుల ఇంటికి వచ్చారు. గంగవ్వను తీసుకుని వారంతా నిజామాబాద్‌కు తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలోనే వీరు ప్రయాణిస్తున్న కారు పోలీస్ బెటాలియన్ సమీపానికి చేరుకోగానే, టైరు పంక్చర్ కావడంతో వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న రవీందర్, గంగవ్వ అక్కడికక్కడే మృతి చెందగా, గంగాధర్, రవీందర్, రాములు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన 108 అంబులెన్స్‌లో క్షతగాత్రులను నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది. పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి ప్రమాదం వివరాల గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.