జాతీయ వార్తలు

అనుసంధానత మెరుగుకు కలిసి పనిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి, అక్టోబర్ 22: భారత్, బంగ్లాదేశ్‌లు ఈ ప్రాంతంలో అనుసంధానతను మెరుగుపరచడానికి జాయింట్ వెంచర్లను ఏర్పాటు చేసే అంశాన్ని తీవ్రంగా పరిశీలించాలని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ సహాయ మంత్రి జనరల్ (రిటైర్డ్) వీకే సింగ్ అన్నారు. వౌలిక సౌకర్యాలను పెంపొందించేందుకు ఇరు దేశాలు ఒక్కటయి జాయింట్ వెంచర్లను నిర్వహించాలని ఆయన సూచించారు. ఇలా చేయడం వల్ల ఇరు దేశాలు పరస్పరం ప్రయోజనం పొందుతాయని ఆయన పేర్కొన్నారు. మంగళవారం నాడిక్కడ నిర్వహించిన ‘్భరత్, బంగ్లాదేశ్ భాగస్వాముల సమావేశం’లో ఆయన మాట్లాడుతూ బంగ్లాదేశ్ మనకు అత్యంత సన్నిహితమైన భాగస్వామి అని, మన పొరుగుదేశం మీదుగా రోడ్డు, రైల్వే కారిడార్ల వల్ల ఈశాన్య ప్రాంతానికి, దేశంలోని మిగతా ప్రాంతాలకు మధ్య అనుసంధానత పెరుగుతుందని అన్నారు. కొనే్నళ్ల క్రితం అప్పటి ప్రధాన మంత్రి అటల్ బిహారి వాజ్‌పేయి ఈశాన్య ప్రాంతాలను దేశంలోని మిగతా ప్రాంతంతో కలపడానికి ఈస్ట్-వెస్ట్ కారిడార్ కింద నాలుగు లేన్ల ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మించాలని భావించారని సింగ్ పేర్కొన్నారు. ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన వాజ్‌పేయి మరో మానస పుత్రిక అని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న రహదారి సౌకర్యాలు లేని గ్రామాలకు ఈ పథకం కింద తారు రోడ్లు నిర్మిస్తున్నట్టు మంత్రి తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’కి తోడు బహుళ విధ అనుసంధానత అభివృద్ధిపై బాగా కేంద్రీకరించారని ఆయన చెప్పారు.