జాతీయ వార్తలు

దేశంలోనే సంపన్న జాతీయ పార్టీ బిజెపి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: భారతీయ జనతా పార్టీ ఇప్పుడు దేశంలోని అన్ని జాతీయ రాజకీయ పార్టీల్లోకి అత్యంత సంపన్న పార్టీ అయింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో అంటే ఆ పార్టీ కేంద్రంలో అదికారంలోకి వచ్చిన సంవత్సరంలో ఆ పార్టీ ఆదాయం రూ. 970.43 కోట్లకు చేరుకుంది. కాగా, 2014-15 ఆర్థిక సంవత్సరానికి ఎన్నికల కమిషన్‌కు తన ఆడిట్ నివేదికను సమర్పించని ఏకైక జాతీయ పార్టీ కాంగ్రెస్ అని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఎడిఆర్) అనే స్వచ్ఛంద సంస్థ మంగళవారం తెలిపింది. 2014 నవంబర్ 19న ఎన్నిల కమిషన్ జారీ చేసిన లేఖ ప్రకారం అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ ఆడిట్ నివేదికలను తప్పనిసరిగా ఇసికి సమర్పించాలి. రాజకీయ పార్టీలు తమ వార్షిక ఆడిట్ చేసిన నివేదికలను సమర్పించడానికి చివరి తేదీ 2015 నవంబర్ 30. అయితే బిజెపి కాక మరో మూడు జాతీయ పార్టీలు సిపిఐ, సిపిఎం, బహుజన్ సమాజ్ పార్టీ( బిఎస్‌పి) మాత్రమే ఈ గడువులోగా తమ ఆడిట్ చేసిన నివేదికలను సమర్పించాయి. దేశంలో జాతీయ పార్టీలుగా గుర్తింపు పొందిన ఆరు పార్టీల్లో బిజెపి, కాంగ్రెస్, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, బిఎస్‌పి, ఎన్‌సిపి ఉన్నాయి.
కాగా, 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ. 920.44 కోట్లుగా ఉండిన జాతీయ పార్టీల ఆదాయం 2014-15 ఆర్థిక సంవత్సరంలో 39 శాతం పెరిగి రూ. 1275.78 కోట్లకు చేరుకుందని ఆ సంస్థ నివేదిక పేర్కొంది. రాజకీయ పార్టీలకు విరాళాలు, కూపన్ల అమ్మకం, సభ్యుల చందాలు తదితర మార్గాల్లో ఆదాయం వస్తుంది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో అన్ని జాతీయ పార్టీల్లోకి బిజెపికి అత్యధికంగా రూ 970.43 కోట్లు ఆదాయం వచ్చిందని, మొత్తం జాతీయ పార్టీల ఆదాయంలో అది 76.06 శాతం అని ఆ నివేదిక తెలిపింది. 2013-14, 2014-15 ఆర్థిక సంవ్తసరాల మధ్య బిజెపి ఆదాయం 44 శాతం అంటే 296.62 కోట్లు పెరిగింది. కాగా, బిఎస్‌పి ఆదాయం 67.31 శాతం అంటే 45.04 కోట్ల రూపాయలు పెరిగింది. కాగా, సిపిఐ ఆదాయం మొత్తం జాతీయ పార్టీల ఆదాయంలో కేవలం 0.14 శాతం అంటే రూ.1.84 కోట్లు మాత్రమే ఉంది. నిజానికి జాతీయ పార్టీలన్నిటిలో ఆదాయం తగ్గిన పార్టీ ఒక్క సిపిఐనేనని, దాని ఆదాయం 24.28 శాతం అంటే దాదాపు 59 లక్షల రూపాయల మేర తగ్గిందని ఆ నివేదిక పేర్కొంది. కాగా, జాతీయ పార్టీల రాబడిలో దాదాపు సగం ఆదాయం అజ్ఞాత మార్గాల ద్వారా వచ్చిందేనని కూడా ఆ నివేదిక వెల్లడించింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో అజ్ఞాత మార్గాల ద్వారా రాజకీయ పార్టీలకు వచ్చిన ఆదాయం రూ. 685.36 కోట్లని, రాజకీయ పార్టీలకు వచ్చిన మొత్తం ఆదాయంలో అది 54 శాతం అని ఎడిఆర్ నివేదిక పేర్కొంది.