క్రీడాభూమి
డేవిడ్ విలియమ్స్‌ను వరించిన ‘హీరో ఆఫ్ ది మంత్’ అవార్డు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ముంబయి, నవంబర్ 10: ఆస్ట్రేలియాకు చెందిన అంతర్జాతీయ ఫుట్‌బాల్ క్రీడాకారుడు డేవిడ్ విలియమ్స్ ‘ఐఎస్ఎల్ హీరో ఆఫ్‌ది మంత్’ అవార్డుకు ఎంపికయ్యాడు. గడచిన అక్టోబర్ మాసానికి సంబంధించి ఈ 31 ఏళ్ల విలియమ్స్‌ను ఈ అవార్డు వరించింది. భారత్‌కు చెందిన ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఆయన పలువురు దిగ్గజ క్రీడాకారుల నుంచి గట్టిపోటీని ఎదుర్కొన్నాడు. కేరళ బ్లాస్టర్స్‌కు చెందిన బర్తొలోమెవ్ ఓగ్బెచా, రెండు సార్లు గోల్డెన్ బూట్ గెలుచుకున్న ఫెరాన్ కోరోమినాస్ (ఎఫ్‌సీ గోవా), జంషెడ్‌పూర్‌కు చెందిన సెర్గియో కేస్టల్, ముంబయి సిటీ ఎఫ్సీకి చెందిన అమరేంద్ర సింగ్‌ల నుంచి విలియమ్స్ గట్టి పోటీని ఎదుర్కొన్నాడు. గత నెలలో ఆయన ఆడిన అత్యుత్తమ మాచ్ల్లో మొత్తం మూడు గోల్స్ వేసి అందరి దృష్టినీ అకట్టుకున్నారు. ఏటీకే ఇన్ ది ఇండియన్ సూపర్‌లీగ్‌లో విలియమ్స్ అద్భుత ఆటతీరును ప్రదర్శించాడు.