Others
సంక్రాంతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 9 January 2020
మంచుకురిసెడి వేళళు మరల వచ్చె
మన పెరడులోన బంతులు మరలవిచ్చె
మన పొలాన చేమంతులు మరల నవ్వె
కనులపండువు సేయు సంక్రాంతి వచ్చె
మంచుకురిసిన మల్లెలు మరల విరిసె
మంచు పొగమబ్బు వ్యాపించి మనసుదోచె
ప్రకృతి హేమంతమున సుందరముగ తోచె
కనుల పండువు సేయు సంక్రాంతి వచ్చె
మనము వేసిన పంటలు మ రల పండె
మన గరిసెలన్ని నిండుగా మరల నిండె
మన కృషివల హృదయాలు మరల మురిసె
కనుల పండువు సేయు సంక్రాంతి వచ్చె
మన జనావళి కన్న స్వప్నాలు పండె
మన జనపదాల బ్రతుకులు మరల వెలిగె
పల్లెపల్లెల్లో పౌష్య శోభలు రవళించె
కనుల పండువు సేయు సంక్రాంతి వచ్చె
రిల్ల గంగెరెద్దువాడు సన్నాయి ఊదె
హరిలో రంగని చిరుతలుమరల మ్రోగె
వీధి వేషాలు ప్రజకు కన్విందు చేసే
కనుల పండువు సేయు సంక్రాంతి వచ్చె
- డా. తిరునగరి
9392465475