Others
సంక్రాంతి - శుభోదయం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 11 January 2020
-ఎల్.ప్రపుల్లచంద్ర
సంక్రాంతి శుభోదయం
తెలుగింట నవోదయం
మన సంస్కృతికి మహోదయం
మహిళా జగతికి ఉషోదయం
రంగు రంగుల రంగవల్లుల స్వాగతం
పౌప్యలక్ష్మీ కళల రసమయం
పల్లెసీమలో విరిసిన మందారం
అందాల సంక్రాంతి సంబరం
హరిదాసుల కీర్తనలతో
డూడూ బసవన్నల ఆటాపాటలతో
ఆబాలగోపాలం అలరించే ఆనందాల పండుగ
మకర సంక్రాంతి శుభ వైభవం
తెలుగింట కళకళలాడే
తెలుగు వెలుగుల పండుగ సంక్రాంతి
ముగ్దలు మనోహరంగా తీర్చిదిద్దిన
రతనాల ముగ్గుల్లో గొబ్బెమ్మల శోభ సంక్రాంతి శోభ
దశ దిశలా సంక్రాంతి సౌభాగ్యం
ప్రకృతి కాంత పులకింత వైభోగం
మధుర సంక్రాంతికి స్వాగతం
మకర సంక్రాంతికి స్వాగతం