జాతీయ వార్తలు

సోనియానే విస్మరిస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: అమెరికా ఆధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం రాష్టప్రతి రామ్‌నాధ్ కోవింద్ మంగళవారం రాత్రి రాష్టప్రతి భవన్‌లో ఏర్పాటు చేసిన బ్యాక్వెట్ విందును కాంగ్రెస్ నాయకులందరూ బహిష్కరించనున్నారు. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కూడా రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ పంపించిన విందు ఆహ్వానాన్ని తిరస్కరించారు. ఇంతకు ముందు లోక్‌సభలో కాంగ్రెస్ పక్షం నాయకుడు అధీర్ రంజన్ చౌదరి, రాజ్యసభలో ప్రతిపక్షం నాయకుడు గులాంనబీ ఆజాద్‌లు కూడా రాష్టప్రతి విందు ఆహ్వానాన్ని తిరస్కరించడం తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం రాష్టప్రతి భవన్‌లో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విందుకు యుపీఏ చైర్‌పర్సన్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని అహ్వానించనందుకు నిరసనగా డాక్టర్ మన్మోహన్ సింగ్ విందును బహిష్కరించాలన్న నిర్ణయానికి వచ్చారు. రాష్టప్రతి భవన్‌లో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విందుకు కాంగ్రెస్ తరపున లోక్‌సభలోకాంగ్రెస్ పక్షం నాయకుడు అధీర్ రంజన్ చౌదరి, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు గులాంనబీ ఆజాద్, మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎన్డీఏ ప్రభుత్వం ఆహ్వానించారు. అయితే సోనియా గాంధీని మాత్రం రాష్టప్రతి భవన్ విందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించకపోవటంతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సోనియా గాంధీ ప్రత్యేక సమావేశం కూడా ఏర్పాటు చేయలేదు. ఈ పరిణామం పట్ల ఆగ్రహంతో ఉన్న కాంగ్రెస్ అధినాయకత్వం రాష్టప్రతి కోవింద్ అమెరికా అధ్యక్షుడి గౌరవార్థం ఏర్పాటు చేసిన విందుకు కాంగ్రెస్ ఆహ్వానితులు ఎవరు కూడా హాజరు కాకూడదని నిర్ణయించింది. ఈ నిర్ణయం మేరకే మన్మోహన్ సింగ్, అధీర్ రంజన్ చౌదరి, గులాం నబీ ఆజాద్ రాష్టప్రతి భవన్ విందుకు వెళ్ళడం లేదని అంటున్నారు. రాష్టప్రతి భవన్ విందుకు హాజరవుతున్నట్లు మన్మోహన్ సింగ్ మొదట ప్రకటించారు. అయితే ఆ తరువాత కాంగ్రెస్ అధినాయకత్వం నుంచి వత్తిడి రావడంతో ఆయన తన మనసు మార్చుకున్నారు.