హైదరాబాద్

ఫిలింనగర్‌లో భారీ చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, ఏప్రిల్ 28: ఫిలింనగర్‌లోని ఓ చార్టర్డ్ అకౌంటెంట్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...్ఫలింనగర్ రామానాయుడు స్టూడియోను ఆనుకొని ఉన్న సీనర్‌వ్యాలి విల్లాస్‌లో చార్టర్డ్ అకౌంటెంట్ శ్యాంసుందర్ శర్మ కుటుంబం నివసిస్తోంది. ఎప్పటిలాగానే బుధవారం రాత్రి నిద్రించి గురువారం తెల్లవారుజామున మేల్కొనేసరికి ఇళ్లంతా చిందరవందరగా కనిపించింది. వెంటనే అనుమానించిన శ్యాంసుందర్ కుంటుంబం పరిశీలించగా బీరువాలోని ఐదు లక్షల నగదు, సుమారు కేజీన్నర బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్టు గుర్తించారు. వెంటనే బాధితులు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. భారీ మొత్తంలో ఆభరణాలు, నగదు చోరీకి గురికావడంతో పోలీసులు హుటాహుటిన సంఘటనా ప్రదేశానికి చేరుకొని వివరాలు సేకరించారు. అనంతరం క్లూస్‌టీంను, డాగ్‌స్క్వాడ్‌ను రప్పించారు. సంఘటనా స్థలాన్ని పోలీసు ఉన్నతాధికారులు సందర్శించి, చోరీ జరిగిన తీరును బాధితుల నుంచి తెలుసుకున్నారు. బుధవారం రాత్రి పడుకునే సమయంలో బెడ్‌రూమ్‌కు ఉన్న కిటికీ సరిగ్గా పెట్టకపోవడంతో దొంగలు అందులోనుంచి లోనికి వచ్చి చోరీ చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.