జాతీయ వార్తలు

ముగిసిన బలపరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెహ్రాడూన్, మే 10: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉత్తరాఖండ్ అసెంబ్లీలో బలపరీక్ష మంగళవారం ముగిసింది. బుధవారం అదిధిరికంగా సుప్రీంకోర్టు ఫలితాలను ప్రకటించనున్నప్పటికీ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ బలపరీక్షలో విజయం సాధించారన్న స్పష్టమైన సంకేతాలు కనిపిస్తుండడంతో ఆ పార్టీ వర్గాలు వేడుకలు జరుపుకొంటుండగా, బిజెపి సైతం పరోక్షంగా తన ఓటమిని అంగీకరించింది. బుధవారం సుప్రీంకోర్టు ప్రకటనతో అనేక మలుపులు తిరిగిన ఉత్తరాఖండ్ సంక్షోభానికి శాశ్వతంగా తెరపడనుంది. అసెంబ్లీలోగంటన్నర సేపు జరిగిన బలపరీక్ష కార్యక్రమం వీడియోను బుధవారం రాష్ట్ర ప్రభుత్వం సీల్డ్ కవర్‌లో సమర్పించిన తర్వాత సుప్రీంకోర్టు ఫలితాన్ని అధికారికంగా ప్రకటించనుంది. ఉత్తరాఖండ్‌లో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలు పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగరేసి ప్రతిపక్ష బిజెపితో చేతులు కలపడంతో మొదలైన రాజకీయ సంక్షోభం ఆ తొమ్మిది మందిని స్పీకర్ అనర్హులుగా ప్రకటించడం, కేంద్రం రావత్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రంలో మార్చి 9న రాష్టప్రతి పాలన విధించడంతో పరాకాష్ఠకు చేరింది.. దీన్ని సవాలు చేస్తూ రావత్ హైకోర్టుకు వెళ్లడం, హైకోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు చెప్పడం, దీనిపై కేంద్రం సుప్రీంకోర్టుకు వెల్లడం తెలిసిందే. కేంద్రం పిటిషన్‌ను పరిశీలించిన సుప్రీంకోర్టు రాష్టప్రతి పాలనను కొనసాగిస్తూనే తన పర్యవేక్షణలో 10న (మంగళవారం) బలపరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. కాగా, తొమ్మిది మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలను స్పీకర్ అనర్హులుగా ప్రకటించడాన్ని సోమవారం సమర్థించిన రాష్ట్ర హైకోర్టు వారు బలపరీక్షలో పాల్గొనరాదని స్పష్టం చేయగా, సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పును సమర్థించడంతో అసెంబ్లీ సంఖ్యాబలం 61కి పడిపోయింది. దీంతో రావత్ విజయం సాధించాలంటే 32 మంది సభ్యుల మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో 27 మంది కాంగ్రెస్ సభ్యులతో పాటుగా ఇద్దరు బిఎస్‌పి, నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుఉన్న రావత్ బలపరీక్షలో విజయం సాధించడం ఖాయమనే విషయం బలపరీక్షకు ముందే స్పష్టమైంది.
కాగా, 33 మంది ఎమ్మెల్యేలు రావత్‌కు అనుకూలంగా ఓటేశారని, 28 మంది బిజెపికి ఓటేశారని బలపరీక్ష అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యే సరితా ఆర్య చెప్పారు. చివరి క్షణలో ప్రత్యర్థి శిబిరాలనుంచి ఒక్కో ఎమ్మెల్యే- బిజెపికి చెందిన బిమల్ ఆర్య, కాంగ్రెస్‌కు చెందిన రేఖా ఆర్య పార్టీ ఫిరాయించి ప్రత్యర్థి వర్గానికి ఓటు వేసినట్లు భావిస్తున్నారు. కాంగ్రెస్ శిబిరంలోని 33 మందిలో ఇద్దరు బిఎస్పీ, ఒక యుకెడి, ముగ్గురు ఇండిపెండెంట్లతో కూడిన పిడిఎఫ్ కూటమికి చెందిన ఆరుగురు సభ్యులున్నారు. ‘ఉత్తరాఖండ్‌ను కమ్ముకున్న అనిశ్చితి కారుమేఘాలు రేపటితో తొలగిపోనున్నాయి’ అని బలపరీక్ష అనంతరం మీడియాతో మాట్లాడుతూ రావత్ అన్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించడం కోసం రాష్ట్రంలో రాష్టప్రతి పాలనను తాత్కాలికంగా ఉదయం 11 గంటలనుంచి రెండు గంటల పాటు ఎత్తేశారు. బలపరీక్ష సందర్భంగా అసెంబ్లీ భవనం చుట్టూ పెద్ద ఎత్తున భద్రతా దళాలను మోహరించారు. శాసన సభ్యులు, సభకు చెందిన ఉద్యోగులను తప్ప మరెవరినీ లోపలికి అనుమతించలేదు. మీడియా సైతం అసెంబ్లీ గేట్ల బయటే వేచి ఉండాల్సి వచ్చింది.

చిత్రం బలపరీక్ష అనంతరం మీడియాతో మాట్లాడుతున్న హరీశ్ రావత్