జాతీయ వార్తలు

విశాఖ-న్యూఢిల్లీ మధ్య రోజువారీ ఎక్స్‌ప్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: రైల్వే బడ్జెట్ రూపకల్పనకు పూర్వరంగంగా ఆ శాఖ మంత్రి సురేష్ ప్రభు మంగళవారం ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాల ఎంపీలతో సమావేశమయ్యారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు ఆధ్వర్యంలో వీరు తమ తమ నియోజకవర్గాల్లో చేపట్టవలసిన పథకాల గురించి వివరించారు. విశాఖ-న్యూఢిల్లీ మధ్య నడుస్తున్న రైలును రోజువారీ ఎక్స్‌ప్రెస్‌గా మార్చాలని వెంకయ్య నాయుడు చేసిన ప్రతిపాదనకు సురేష్ ప్రభు ఆమోదం తెలిపారు. ఈ నెలాఖరు నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. అలాగే తిరుపతి రైల్వే స్టేషన్ విస్తరణ గురించి వెంకయ్య నాయడు నేరుగా అధికారులతో మాట్లాడారు. తిరుపతిలో భూసేకరణ విషయమై ఆయన ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్, కార్యనిర్వహణాధికారితో మాట్లాడి సమస్యలను పరిష్కరించాల్సిందిగా కోరారు. విజయవాడ-గుంటూరు మైట్రో రైలు ద్వారా వెంటనే లాభాలు వచ్చే అవకాశం లేనందున మల్టిపుల్ రైలును నడపాలని వెంకయ్య నాయుడు సూచించారు. ఈ ప్రతిపాదనపై సర్వే చేయించి తగిన చర్యలు తీసుకుంటామని సురేష్ ప్రభు హామీ ఇచ్చారు. కాకినాడ-కోటిపల్లి లైన్‌ను నర్సాపురం వరకు విస్తరించాలని కాకినాడ ఎంపీ తోట నరసింహం, అమలాపురం ఎంపీ రవీంద్రబాబు చేసిన ప్రతిపాదనకు ఆయన సానుకూలంగా స్పందించారు. ఖాజీపేటలో నిర్మించ తలపెట్టిన కోచ్ ఫ్యాక్టరీ విషయం ఈ సమావేశంలో ప్రస్తావనకు రాగా, ఇప్పటికే డిమాండ్‌ను మించి ఉత్పత్తి జరిగిందని, కొత్త కోచ్‌ల ప్రతిపాదన వచ్చినప్పుడు దీనిని తప్పకుండా పరిశీలిస్తామని సురేష్ ప్రభు స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలో రైల్వే అండర్ బ్రిడ్జి ఖర్చును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం భరించేలా ఆమోదం తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు అంశం పరిశీలనలో ఉందని విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబుకు తెలియజేశారు.