జాతీయ వార్తలు

అత్యాచార బాధితురాలికి కేజ్రీవాల్, సోనియా పరామర్శ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 26: ఢిల్లీలో అత్యాచారానికి గురై ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న 13 ఏళ్ల బాలికను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ గురువారం పరామర్శించారు. మానసిక వికలాంగురాలైన మైనర్‌పై అత్యాచారం చేసి ఆగ్నేయ ఢిల్లీలోని పుల్ ప్రహ్లాద్‌పూర్ రైల్వే ట్రాక్ వద్ద వదిలేశారు. ఈ నెల 17న కనిపించకుండాపోయింది. 18వ తేదీ తెల్లవారుజామున రైల్వేట్రాక్‌పై అపస్మారక స్థితిలో పడిఉండగా కనుగొన్నారు. దిగ్భ్రాంతి కలిగించిన ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితురాలిని ఎయిమ్స్‌కు తరలించి వైద్య సేవలందిస్తున్న సంగతి తెలిసిందే. బాధితురాలిని పరామర్శించిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రభుత్వం తరఫున అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఢిల్లీకి రాష్ట్ర ప్రతిపత్తి లేకపోవడం వల్లే తరచూ ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం దృష్టికి అనేక సందర్భాల్లో ఈ విషయం తీసుకెళ్లానని ఆయన అన్నారు. పోలీసులు, కీలక శాఖలు కేంద్రం పరిధిలో ఉండడం వల్ల శాంతిభద్రతల పరిరక్షణలో తమకు పరిమితమైన అధికారాలే ఉన్నాయన్నారు. అలాగే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ గురువారం మధ్యాహ్నం ఎయిమ్స్‌కు వచ్చి అత్యాచార బాధితురాలిని పరామర్శించారు. బిజెపి ఎంపీ మీనాక్షి లేఖి, ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ బర్ఖా శుక్లా సింగ్ బాధితురాలిని పరామర్శించారు.