జాతీయ వార్తలు

ఒక మిషన్.. 22 ఉపగ్రహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మే 29: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో చరిత్రాత్మక ప్రయోగాన్ని చేపట్టబోతోంది. 2008లో ఒకే మిషన్‌లో 10 ఉపగ్రహాలను రోదసిలోకి పంపించిన ఇస్రో, ఈసారి ఏకంగా 22 ఉపగ్రహాలను ప్రయోగించబోతోంది. ‘‘ప్రస్తుతం పునర్వినియోగ వాహక నౌకకు సంబంధించి మరో ప్రయోగం చేయాల్సి ఉంది. మేం దాని గురించి ఆలోచిస్తున్నాం. వచ్చే నెలలో ఒకే మిషన్‌లో 22 ఉపగ్రహాలను రోదసిలోకి పంపిస్తున్నాం ఆ తరువాత వెంటనే కార్టోగ్రాఫిక్ సిరీస్ శాటిలైట్‌ను పంపించాల్సి ఉంది’ అని ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్ అన్నారు. కర్ణాటక చాంబర్స్ ఆఫ్ కామర్స్ ఫెడరేషన్ అధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఆదివారం మాట్లాడారు. తాజాగా లాంచ్ చేయబోతున్న 22 ఉపగ్రహాలలో మూడు భారత్‌కు చెందినవి కాగా, మిగతావి అమెరికా, కెనడా, ఇండోనేసియా, జర్మనీలకు చెందిన ఉపగ్రహాలు ఉన్నాయని ఆయన తెలిపారు. పిఎస్‌ఎల్‌వి-సి34 వాహక నౌకద్వారా ఈ ఉపగ్రహాలను రోదసిలోకి పంపిస్తామని ఆయన వివరించారు. ఈ ప్రయోగం తరువాత వెంటనే స్కాటెరోమీటర్ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తామన్నారు. ఆ వెంటనే వాతావరణ ఉష్ణోగ్రత, తేమలను తెలిపే జియో స్టేషనరీ శాటిలైట్ ఇన్‌సాట్ 3డి ఆర్ ను ప్రయోగించబోతున్నట్లు కిరణ్ కుమార్ వెల్లడించారు.