రాశిఫలం 31-05-2016

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిథి: 
బహుళ దశమి రా.8.31
నక్షత్రం: 
ఉత్తరాభాద్ర రా.9.09
వర్జ్యం: 
ఉ.7.36 నుండి 9.06 వరకు
దుర్ముహూర్తం: 
ఉ.08.24 నుండి 09.12, తిరిగి రా.10.48 నుండి 11.36
రాహు కాలం: 
మ.3.00 నుండి 4.30
మేషం: 
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) వృత్తి, ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధన లాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి.
వృషభం: 
(కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.) కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా నుండుటచే మానసికానందాన్ని పొందుతారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. నిన్నటివరకు వాయిదావేయబడిన కొన్ని పనులు ఈరోజు పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు.
మిథునం: 
(మృగశిర 3,4పా., ఆర్ద్ర, పునర్వసు 1,2,3పా.) ఆకస్మిక ధన లాభముంటుంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు లభిస్తాయి. బంధు, మిత్రులతో కలుస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. సంపూర్ణ ఆరోగ్యవంతులుగానుంటారు. ప్రతి విషయంలో అభివృద్ధి ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు.
కర్కాటకం: 
(పునర్వసు 4పా., పుష్యమి, ఆశ్రేష) ఆకస్మిక ధనలాభయోగముంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలుంటాయి. అంతటా అనుకూల వాతావరణమేర్పడుతుంది. స్ర్తిలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధు, మిత్రులు కలుస్తారు.
సింహం: 
(మఖ, పుబ్బ, ఉత్తర 1పా.) బంధు, మిత్రులతో మనస్పర్థలు రాకుండా జాగ్రత్తవహించుట మంచిది. అనుకోకుండా డబ్బు చేజారే అవకాశాలున్నాయి. ఆరోగ్య విషయంలో మిక్కిలి శ్రద్ధ అవసరం. శారీరక శ్రమతోపాటు, మానసికాందోళన తప్పదు. చిన్న విషయాలకై ఎక్కువ శ్రమిస్తారు.
కన్య: 
(ఉత్తర 2,3,4పా., హస్త, చిత్త 1,2పా.) కుటుంబమంతా సంతోషంగా నుంటారు. గతంలో వాయిదావేసిన పనులన్నీ పూర్తిచేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యమేర్పడుతుంది. స్థిర నివాసముంటుంది. వ్యవసాయ మూలకంగా లాభాలను పొందుతారు. ప్రయత్నకార్యాలన్నీ ఫలిస్తాయి. సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు.
తుల: 
(చిత్త 3,4పా., స్వాతి, విశాఖ 1,2,3పా.) కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. ఆకస్మిక ధనలాభంతో ఆనందాన్ని పొందుతారు. ఇతరులకు ఉపకారంచేసే కార్యాల్లో నిమగ్నులవుతారు. స్ర్తిల మూలకంగా లాభం వుంటుంది. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. ఋణబాధలు తొలగిపోతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది.
వృశ్చికం: 
(విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ) కోపాన్ని అదుపులోనుంచుకొనుట మంచిది. మానసికాందోళనను తొలగించుటకు దైవధ్యానం అవసరం. శారీరిక అనారోగ్యంతో బాధపడతారు. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా నుండవు. వృధా ప్రయాణాలెక్కువవుతాయి. ధన వ్యయం తప్పదు.
ధనుస్సు: 
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.) ఆకస్మిక ధనలాభముంటుంది. నూతన వస్తు, ఆభరణాలు ఖరీదుచేస్తారు. ముఖ్యమైన వ్యక్తులు కలుస్తారు. అన్నిరంగాల్లో అద్భుత విజయాలను సాధిస్తారు. నూతన కార్యాలను ప్రారంభిస్తారు. ఋణ విముక్తి లభిస్తుంది. మానసికానందం పొందుతారు.
మకరం: 
(ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.) మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్తవహించుట అవసరం. నూతన కార్యాలకు ఆటంకాలేర్పడతాయి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణవల్ల ఇబ్బందులనెదుర్కొంటారు. ఇతరులకు హాని తలపెట్టు కార్యాలకు దూరంగా వుంటారు.
కుంభం: 
(్ధనిష్ఠ 3,4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.) ఆరోగ్యం గూర్చి జాగ్రత్తపడుట మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమవౌతుంది. కుటుంబ కలహాలకు దూరంగావుంటే మేలు. సహనం అన్నివిధాలా శ్రేయస్కరం. డబ్బును పొదుపుగా వాడతారు.
మీనం: 
(పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి) వ్యాపారంలో విశేష లాభాన్ని ఆర్జిస్తారు. మంచివారితో స్నేహం చేస్తారు. అంతటా సుఖమే లభిస్తుంది. ఆకస్మిక ధన లాభముంటుంది. బంధు, మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఒక ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తారు. నూతన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు.
Date: 
Tuesday, May 31, 2016
author: 
గౌరీభట్ల దివ్యజ్ఞాన సిద్ధాంతి