మెదక్

సమన్వయం లోపిస్తే కఠిన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, మే 31: మండల అభివృద్ధి అధికారులు, ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీర్లు సమన్వయంతో పని చేసి గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నివారణ పనులు చేపట్టాలని కలెక్టర్ రొనాల్డ్ రోస్ సూచించారు. మంగళవారం కలెక్టర్ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించి మండలాల వారిగా త్రాగు నీటి ఎద్దడిపై సమీక్షించారు. ఆర్‌డబ్ల్యూఎస్, మండల అభివృద్ధి అధికారుల మద్య సమన్వయం లేక సిఆర్‌ఎఫ్, నాన్ సిఆర్‌ఎఫ్ పనుల ప్రతిపాదనలు సమర్పించడంలో జాప్యం చేయడం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేసారు. రెండు శాఖలు కూడా పంచాయతీరాజ్ క్రిందనే పని చేస్తున్నాయనే విషయాన్ని విస్మరించరాదని కలెక్టర్ హితవు పలికారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీర్లు, మండల అభివృద్ధి అధికారులు పరస్పర సంబంధం లేనట్లు వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. నాన్ సిఆర్‌ఎఫ్ క్రింద ప్రభుత్వ మార్గదర్శకాలు విధిగా పాటించాలని ఆదేశించారు. నిధులు విడుదల చేసినట్లైతే పనులను పరిశీలించినట్లుగాను, బిల్లులు సమర్పించినచో వాటిని స్క్రూటిని చేసినట్లుగా బావిస్తామని అన్నారు. నాన్ సిఆర్‌ఎఫ్ క్రింద చేసిన పనులు ప్రతిపాదనలన్ని రెండు రోజుల్లోగా పంపాలని, వర్షాలు కురిస్తే చేసిన పనుల వివరాలు తెలియడం కష్టసాధ్యమవుతుందన్నారు. చేసిన పనుల చాలా మేరకు ఇంకా పరిపాలనా ఆమోదం పొందలేదని, వెంటనే క్షేత్రస్థాయిలో జరిగిన పనులు పరిశీలించి ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ ఎంపిడిఓలను, ఎఇలను ఆదేశించారు. శాసన సభ్యులు, జిల్లా ప్రాదేశిక సభ్యులు, సాధారణ ప్రజల నుండి నాన్ సిఆర్‌ఎఫ్ పనుల కొరకు అందిన దరఖాస్తులు వెంటనే పరిశీలించాలని సూచించారు. చేసిన పనులకు సంబంధించిన వివరాలను ఎఇలు, ఎంపిడిఓలు ఉమ్మడిగా ధృవీకరించి ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఇకి పంపాలన్నారు. నాన్ సిఆర్‌ఎఫ్ క్రింద కొత్త సామూహిక రక్షిత నీటి పథకాలకు సంబంధించిన మరమ్మతు పనులకు ప్రతిపాదనలు పంపాలని, వెంటనే మంజూరు చేస్తామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో కొత్తగా బోరుబావులు త్రవ్వించరాదని కలెక్టర్ మరోమారు అధికారులను ఆదేశించారు. కొన్ని చోట్ల బోర్లు మంజూరు చేయడం పట్ల అసహానం వ్యక్తం చేస్తూ ఎవరి అనుమతితో కొత్త బోర్లు మంజూరు చేసారని అధికారులను ప్రశ్నించారు. ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో జడ్పీ సిఇఓ వర్షిణి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఇ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.