జాతీయ వార్తలు

పొలిటికల్ సైన్స్ అంటే వంట నేర్పే సబ్జెక్ట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, జూన్ 1: పొలిటికల్ సైన్స్ అంటే వంటలు నేర్పే సబ్జెక్ట్ అట. ఇంటర్మీడియట్‌లో ఆ సబ్జెక్ట్‌లో రాష్ట్రంలోనే టాపర్‌గా నిలిచిన ఓ విద్యార్థిని చెప్పిన సమాధానమిది. అంతేకాదు ఆ అమ్మాయి ఆ పదాన్ని సరిగా ఉచ్చరించలేకపోయింది కూడా. సైన్స్‌లో ఫస్ట్ ర్యాంక్ సాధించిన మరో విద్యార్థి అయితే తన సబ్జెక్ట్‌కు సంబంధించిన ప్రాథమిక స్థాయి ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేక పోయాడు. బిహర్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు ఈ ఏడాది నిర్వహించిన పరీక్షల్లో రాష్ట్రంలోనే టాపర్లుగా నిలిచిన వారి తెలివితేటలు ఇలా ఏడిస్తే మిగతా లక్షలాది మంది విద్యార్థుల స్థాయి ఎలా ఉంటుందో ఎవరైనా ఊహించవచ్చు. గత వారం ఈ పరీక్ష ఫలితాలను ప్రకటించారు. ఈ పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన కొంతమందిని స్థానిక న్యూస్ చానల్ ఇంటర్వ్యూ చేసింది. ఆ దృశ్యాలు టీవీల్లో ప్రసారం కావడంతో బిహార్ రాష్ట్ర ప్రభుత్వం బిక్కమొగం వేయడమే కాకుండా ఈ మొత్తం పరీక్షలపైన విచారణకు ఆదేశించింది.
అంతేకాకుండా ఎగ్జామినర్లు వారికి అంత గొప్ప మార్కులు ఇవ్వడానికి వెనుక ఉన్న వాస్తవం ఏమిటో తెలుసుకోవడానికి ఈ మూడు సబ్జెక్ట్‌లలో టాప్ ర్యాంకులు పొందిన అయిదుగురిని నిపుణుల కమిటీ తిరిగి పరీక్షిస్తుందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి అశోక్ చౌదరి చెప్పారు.
న్యూస్ చానల్ ప్రశ్నించిన ఈ ఇద్దరు టాపర్లు వైశాలి జిల్లాలోని భగవాన్‌పూర్‌లో ఉన్న బిషున్ రాయ్ కాలేజికి చెందిన వారు. గత ఏడాది కూడా ఈ కాలేజి తీవ్ర వివాదాల్లో చిక్కుకుంది. పరీక్షల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయంటూ ఫిర్యాదులు రావడంతో ఆ కాలేజి ఫలితాలను అప్పటి విద్యా శాఖ మంత్రి పికె షాహి నిలిపి వేశారు కూడా.