హైదరాబాద్

ఆస్తిపన్ను డ్రాలో 119 మందికి నగదు బహుమతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 1: ఆస్తిపన్ను ఎంత అన్నది ముఖ్య కాదు. సకాలంలో చెల్లించామా? లేదా? అన్నదే ముఖ్యం. కేవలం రూ. 51 ఆస్తిపన్ను చెల్లించిన మల్కాజ్‌గిరి సర్కిల్ నెరెడ్‌మెడ్ కాకతీయనగర్‌కు చెందిన జి.బాపిరెడ్డి జిహెచ్‌ఎంసి ప్రకటించిన బంపర్ బహుమతి రూ. లక్షను గెల్చుకున్నారు. మే మాసంలో చివర్లో 29 నుంచి 31వ తేదీ వరకు ఎలాంటి బకాయిల్లేకుండా మొత్తం ఆస్తిపన్ను చెల్లించిన సమారు 10వేల 777 మంది వివరాలతో విజేతలను ఎంపిక చేసేందుకు బుధవారం జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్దన్ రెడ్డిలు ప్రత్యేక సాఫ్ట్‌వేర్ సహాయంతో డ్రా నిర్వహించారు. ఇందులో బంపర్ బహుమతిని బాపిరెడ్డి గెలుచుకోగా, కమిషనర్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్‌లు చేపట్టిన లాటరీ ద్వారా విజేతలను ప్రకటించారు. ఇందులో రూ. 50వేల మొదటి బహుమతిని ఆబిడ్స్ సర్కిల్ దయారా ప్రాంతానికి చెందిన పి. అశోక్ గెలుపొందగా, రూ. 25వేల రెండు బహుమతులను రెండింటిని ఎల్లారెడ్డిగూడకు చెందిన ఒకరు, చార్మినార్‌కు సర్కిల్ 4బి పరిధిలోని సరూర్‌నగర్‌కు చెందిన ఎం. సునిత గెల్చుకున్నట్లు తెలిపారు. అలాగే రూ. పదివేల అయిదు బహుమతులను సర్కిల్ 12 శేరిలింగంపల్లికి చెందిన మక్తమహాబూబ్‌పేటకు చెందిన మర్వాడ జగన్నాథ్ సంజయ్ సరోజ్, ఆబిడ్స్ 9బి సర్కిల్‌లోని విఆర్‌ఎన్ శర్మ, ఖైరతాబాద్ 7బి సర్కిల్‌కు చెందిన దత్తాత్రేయనగర్‌కు చెందిన ఒకరు, ఎల్బీనగర్ సర్కిల్ 3బిలోని కర్మాన్‌ఘాట్‌కు చెందిన టి. పావని, ఆబిడ్స్ సర్కిల్ 9బిలోని నల్లకుంటకు చెందిన క్షత్రియసేవా సమితిలకు బహుమతులు లభించాయి. రూ. 5వేల నగదు బహుమతులకు మరో పది మందిని, అలాగే రూ. 2వేల వంద నగదు బహుమతులకు మరో వంద మందిని ప్రకటించారు.
ట్రేడ్ లైసెన్సు ఛార్జీలను సకాలంలో చెల్లించండి
హైదరాబాద్ నగరాభివృద్ధికి గాను ఆస్తిపన్నుతో పాటు వివిధ వ్యాపార సంస్థలకు చెందన యజమానులు సకాలంలో ట్రేడ్ లైసెన్సు ఛార్జీలను చెల్లించి, సహకరించాలని బొంతు రామ్మోహన్ కోరారు. జూన్ 30 తేదీలోగా ఆస్తిపన్ను చెల్లించాలని, లేని పక్షంలో చెల్లించాల్సిన మొత్తంలో పన్నులో రెండు శాతం వడ్డీగా వర్తింపజేయనున్నట్లు ఆయన తెలిపారు.
కమిషనర్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ విద్యుత్, నీటి ప న్నులను నెలవారి చెల్లిస్తున్న విధంగానే ఆస్తిపన్నును కూడా నెలవారిగా విధిగా చెల్లించేలా సరికొత్త విధానంపై అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు.

బంగారు తెలంగాణ కోసం
అహర్నిశలు శ్రమిస్తున్న సిఎం
సికింద్రాబాద్, జూన్ 1: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళుతున్నారని మంత్రి టి.పద్మారావుగౌడ్ పేర్కొన్నారు. బుధవారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు హార్థిక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిఎం కెసిఆర్ ఎన్నో వినూత్న పథకాలతో దేశంలోనే రాష్ట్రాన్ని ఆదర్శవంతంగా నిలిపారన్నారు. కొత్త రాష్టమ్రైనప్పటికీ ప్రపంచంలోని పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు నూతన పారిశ్రామిక విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారని, రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించడానికి మిషన్ కాకతీయను తీసుకువచ్చారన్నారు. ఇంటింటికీ మంచినీరు అందించేందుకు మిషన్ భగీరథను పూర్తి చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టి దేశంలోనే మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా సిఎం కెసిఆర్ నిలిచారని మంత్రి పేర్కొన్నారు. బంగారు తెలంగాణ కలను సాకారం చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి నిరంతర శ్రామికుడిలా పనిచేస్తూ తెలంగాణను అంతర్జాతీయంగా తీర్చిదిద్దుతున్నారని అన్నారు. మరోవైపు రాష్ట్ర రాజధాని హైద్రాబాద్ పరిశుభ్రంగా, డల్లాస్ నగరంగా తీర్చిదిద్దేందుకు స్వచ్ఛ హైద్రాబాద్ తీసుకువచ్చిన ఘనత సిఎం కేసిఆర్‌కే దక్కుతుందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రం విడిపోతే విద్యుత్ లేకుండా చీకటి అయిపోతుందన్న అపోహలను దూరం చేస్తూ కోతలు లేని విద్యుత్ సరఫరా చేపట్టడంతోపాటు కొత్తకొత్త విద్యుత్ ప్రాజెక్టులకు పొరుగు రాష్ట్రాలతో ఒప్పందం చేసుకుని మిగులు విద్యుత్ సాధించే దిశగా రాష్ట్రం అడుగులు వేస్తోందని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. తెలంగాణలోని అటవీ ప్రాంతాన్ని 24శాతం నుంచి 33శాతానికి పెంచడమే లక్ష్యంగా హరితహారం ప్రారంభించారని, అతి త్వరలో హరిత తెలంగాణను సాధిస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. కళ్యాణలక్ష్మీ, షీ టీమ్స్, భూ పంపిణీ, మధ్యాహ్న భోజన పథకాలు, సన్నబియ్యం పంపిణీ తదితర కార్యక్రమాలతో ప్రతి గ్రామం స్వయం పాలనతో స్వయం సమృద్ధి సాధించాలన్నదే తెలగాణ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పద్మారావు పేర్కొన్నారు. రాబోయేరోజుల్లో బంగారు తెలంగాణను సాధించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఈ సందర్భంగా మంత్రి పద్మారావు పేర్కొన్నారు.