మెదక్

ఎంపిడిఓకు హరీష్‌రావు ప్రశంస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్ రూరల్, జూన్ 2:రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉత్తమ మండల అవార్డును ఎంపిడిఓ రాంబాబు మంత్రి హరీష్‌రావు చేతులమీదుగా గురువారం అందుకున్నారు. జిల్లా కేంద్రం సంగారెడ్డిలోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన వేడుకల్లో మంత్రి టి.హరీష్‌రావు చేతులమీదుగా జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ సమక్షంలో ప్రశంసాపత్రం, 51 వేల 116 రూపాయల చెక్కు, షీల్డును అందుకున్నట్లు తెలిపారు. మెదక్ మండలంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అధికారిగా చురుకైన పాత్రపోషిస్తు ఇతర శాఖల అధికారులను సమన్వయంచేయడంతో సాధ్యమవుతున్నట్లు ఎంపిడిఓ రాంబాబు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మార్గదర్శంలో మండలాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్తామన్నారు.