అనంతపురం

సమస్యలు పక్కన పెట్టి సంబరాలా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కదిరి టౌన్, జూన్ 2: రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యలను గాలికి వదిలిపెట్టి నవ దీక్ష నిర్మాణం, వికాస్ పర్వాల పేరిట సిఎం చంద్రబాబు, దేశ ప్రధాని మోదీలు ఎవరిని ఉద్ధరించడానికి ఈ సంబరాలు చేస్తున్నారని ఎపి పిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి ప్రశ్నించారు. గురువారం కదిరి పట్టణంలోని దాదా ఫంక్షన్ హాల్ నందు జరిగిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు సమావేశం జరిగింది. సమావేశానికి రాష్ట్ర పిసిసి ఉపాధ్యక్షులు సాకే శైలజానాథ్, జిల్లా అధ్యక్షులు కోటా సత్యం, మాజీ ఎమ్మెల్యే టిడి నాగరాజరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరైనారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నో హామీలను ప్రజలకు ఇచ్చారన్నారు. గద్దెనెక్కిన అనంతరం ప్రజలను మోసగించి ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా టిడిపి నాయకులను మాత్రం అందలం ఎక్కిస్తున్నారన్నారు. ప్రధానంగా రైతుల రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణమాఫీ, నిరుద్యోగ యువతకు ఇంటికొక్క ఉద్యోగం, నెలకు 2వేల చొప్పున నిరుద్యోగ భృతి తదితర ఆశలను కల్పించి నేడు ఒక్కటి కూడా నెరవేర్చకుండా మొండిగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రధానంగా కరవుకు నిలయమైన అనంతపురం జిల్లాలో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలో కదిరి మండలం బ్రాహ్మణపల్లి వద్ద హంద్రీనీవా ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. నేటికి ఎనిమిది సంవత్సరాలు పూర్తికావస్తున్నా ఇంతవరకు హంద్రీనీవా పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తికావడానికి 2 వేల కోట్లు కావాల్సి వుండగా కేవలం 250 కోట్లు నిధులు మాత్రం విడుదల చేసి చేతులు దులుపుకున్నారన్నారు. అలాగే ఎన్‌పికుంట సోలార్ హబ్‌లో వేలాది ఎకరాల ఎస్సీ, ఎస్టీలకు చెందిన భూములకు మంజూరైన పరిహారం టిడిపి నాయకులు, కార్యకర్తల జేబులలోకి వెళ్ళిందన్నారు. మూడు పర్యాయాలు ప్రధాని మోదీ ఎపిలో పర్యటించినప్పటికి ప్రత్యేక ప్యాకేజి ఊసే ఎత్తకుండా తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు. బిజెపి నుంచి గెలుపొందిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గడ్ ముఖ్యమంత్రులు అనేక కుంబకోణాలలో చిక్కుకుని వుంటే వారిని ప్రధాని వెనకేసుకొనివస్తూ అవినీతి పాలనను కొనసాగిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు సివి క్రిష్ణమూర్తి, లీగల్‌సెల్ కన్వీనర్ రామాస్వామినాయుడు, కొమ్ము విజయభాస్కర్, రమణ, ఆరీప్‌అలి, మేదర నాగబూషణ, షానవాజ్, ఇన్‌చార్జ్‌లు కెటి శ్రీ్ధర్, బాలాజి, బాలబాబు, ప్రభాకర్, ఇందాదుల్లాఖాన్, ఆరీప్‌అలి, తమ్మల మాహబూబ్‌బాషా, చంద్రమోళి పాల్గొన్నారు.