ఖమ్మం

సుదర్శన హోమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, జూన్ 2: శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదావరి నుంచి తీర్ధబిందెను తెచ్చి సుప్రభాత సేవ చేశారు. అనంతరం స్వామికి పంచామృతాలతో అభిషేకం చేశారు. విష్వక్షేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన చేసి బాలభోగం సమర్పించారు. బేల మండపంలో నిత్యకల్యాణం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు. తర్వాత యాగశాలలో సుదర్శన హోమం చేశారు. సుదర్శన జపం, మంత్రం, హోమం నిర్వహించారు.
ఆదివాసీల జిల్లా సాధన దీక్షలకు సంపూర్ణ మద్దతు
భద్రాచలం, జూన్ 2: భద్రాచలం ఐటీడీఏ ఎదుట గిరిజన సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో భద్రాచలం ఆదివాసీ జిల్లా సాధన కోరుతూ చేపట్టిన ఆమరణ నిరహార దీక్షలు రెండవరోజుకు చేరుకున్నాయి. గురువారం దీక్షా శిబిరాన్ని ఎమ్మెల్యే సున్నం రాజయ్య సందర్శించి ఆమరణ దీక్షల్లో పాల్గొంటున్న 13 మంది ఆదివాసీ నాయకులను అభినందించారు. సీపీఎం పార్టీ జాతీయ విధానంలో ట్రైబల్ అటానమస్ కౌన్సిల్ వ్యవస్థను అమలు చేయాలని తీర్మానం ఉన్నట్లు గుర్తు చేశారు. గతంలో సిపిఎం పార్టీ పాలనలో ఉన్న పశ్చిమబెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లో ట్రైబల్ అటానమస్ కౌన్సిల్ వ్యవస్థను అమలు చేయడం జరిగిందని, అదే తరహాలో తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసీ జిల్లాలు ఏర్పాటు చేస్తూ ఆదివాసీ జిల్లా కేంద్రాల్లో అటానమస్ కౌన్సిల్ వ్యవస్థను కూడా ప్రకటించే వరకు ఆదివాసీలు పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఆదివాసీలు చేస్తున్న ఆదివాసీ జిల్లా సాధన ఉద్యమంలో ఆదివాసీ ఎమ్మెల్యేగా సిపిఎం పార్టీ తరుపున సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఆదివాసీల ఆమరణ దీక్షలను గౌరవించి ఆదివాసీల మనుగడ కోసం, ఆదివాసీల స్వయం పాలన కోసం, ఆదివాసీ చట్టాల పరిరక్షణ కోసం భద్రాచలం కేంద్రంగా ఆదివాసీ జిల్లాను తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఆదివాసీల ఆమరణ నిరాహార దీక్షలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ గిరిజన నాయకుడు కుంజా ధర్మా మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలుగు రాష్ట్రాలు విడిపోవడం వల్ల ఆదివాసీల మనుగడ ప్రశ్నార్థకమైందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని 24 ఆదివాసీ మండలాలను ఒకే భూభాగంగా ఉంచుతూ ఆదివాసీల కోసం ప్రత్యేక ఆదివాసీ జిల్లా ఏర్పాటు చేయడం అనివార్యమన్నారు. భద్రాచలం కేంద్రంగా ఆదివాసీల జిల్లా ఏర్పాటు జరిగితే దేశంలోనే ఆదివాసీల ఆదర్శవంతమైన స్వయం పాలన వ్యవస్థలు అమలు చేయవచ్చన్నారు. భద్రాచలం చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ చారుగుళ్ళ శ్రీనివాస్, ఉస్మానియా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అపక నాగేశ్వరరావు, వార్డు సభ్యులు సున్నం గంగా, పుష్పవతి, నరేష్, బత్తుల గోపాలరావు, వసంతాల రాజేష్, కల్పన, పూసం రవికుమారి సంఘీభావం తెలిపారు.