మెదక్

ఆకట్టుకున్న ఛాయాచిత్ర ప్రదర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, జూన్ 3: మెదక్ బాలుర జూనియర్ కళాశాల గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన చాయాచిత్ర ప్రదర్శన శుక్రవారం కూడా కొనసాగింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను పురష్కరించుకొని మెదక్ పిఆర్‌ఓ మంగ నాగభూషనంగౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఛాయచిత్ర ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. మెదక్ నియోజకవర్గంలో పర్యటించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఫొటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ఘణపురం ఆనకట్ట కుడి, ఎడమ కాలువల ఆధునీకరణకు శంకుస్థాపన చేసిన చిత్రాలు కూడా ఏర్పాటు చేశారు. డిప్యూటి స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పర్యటనను కూడా ఎగ్జిబిషన్‌లో పొందుపరిచారు. దేవాదాయ శాఖ మంత్రి, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ చిత్రపటాలు, ఏడుపాయల అమ్మవారిని దర్శించుకున్న నిజామాబాద్ ఎంపి చిత్రపటాలను కూడా ఏర్పాటు చేశారు. మిషన్ కాకతీయ చెరువు పనులు సంక్షేమ పథకాలకు సంబంధించిన ఫొటోలు ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేశారు. మొదటి రోజున ఉదయం 9:30 గంటలకు ఆర్డీఓ మెంచు నగేష్ తెరాస రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి ప్రారంభించారు. జడ్పిటిసి లావణ్యరెడ్డి, చైర్మన్ మల్లిఖార్జున్‌గౌడ్, వైస్ చైర్మన్ రాగి అశోక్, కౌన్సిలర్లు ఈ ఎగ్జిబిషన్‌ను సందర్శించిన వారిలో ఉన్నారు. శుక్రవారం కూడా చాయాచిత్ర ప్రదర్శన కొనసాగింది.