హైదరాబాద్

గాలి..వాన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 3: మహానగరంలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షం మరోసారి బీభత్సాన్ని సృష్టించింది. భారీ వర్షానికి బలమైన గాలులు కూడా తోడుకావటంతో మరో సారి నగర ప్రజలు ఉలిక్కిపడ్డారు.
గడిచిన నెలరోజుల్లో మూడుసార్లు బలమైన ఈదురుగాలులతో వర్షం కురిసి, ప్రజలు నానా ఇబ్బందులెదుర్కొన్న సంగతి తెలిసిందే! ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం మరో సారి కురిసిన భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యరు. సుమారు గంటన్నర సేపు కురిసిన వర్షానికి ప్రకాశ్‌నగర్, సికిందరాబాద్, ముషీరాబాద్, చిక్కడపల్లి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, రెడ్‌హిల్స్, హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్, లోయర్ ట్యాంక్‌బండ్‌తో పాటు ఇందిరాపార్కు తదితర ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగినట్లు తెలిసింది. వర్షానికి చార్మినార్, బేగంపేట, రాణిగంజ్, ఖైరతాబాద్, హిమాయత్‌నగర్, కోఠి, కాచిగూడ, కెసిపి జంక్షన్, పంజాగుట్ట, లక్డీకాపూల్, బషీర్‌బాగ్, ఎం.జె.మార్కెట్ ప్రాంతాల్లో వర్షం కాస్త తగ్గముఖం పట్టిన తర్వాత కూడా గంటల తరబడి ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచింది. లోయర్ ట్యాంక్‌బండ్‌లో విద్యుత్ దీపాలు కూడా పనిచేయకపోవటంతో తీవ్ర అంధకారమేర్పడి వాహనదారులు ముందుకెళ్లేందుకు అనేక ఇబ్బందులెదుర్కొన్నారు. వర్షం కురుస్తున్నంత సేపు ట్యాంక్‌బండ్‌పై ఎక్కడి వాహనాలు అక్కడే నిల్చిపోయాయ. శివార్లలో కూడా వర్షం బాగా దంచికొట్టింది. ట్రాఫిక్‌కు ఇబ్బందులు తప్పలేదు. దీంతో పాటు ఖైరతాబాద్, అమీర్‌పేట, రాణిగంజ్, లక్డీకాపూల్, బైబిల్‌హౌజ్, ఎం.జె.మార్కెట్, కోఠి తదితర ప్రాంతాల్లో రోడ్డుపై మొకాలిలోతు వరకు వర్షపు నీరు నిలవటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు.