హైదరాబాద్

చేప ప్రసాదం పంపిణీపై సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 3: మృగశిరకార్తెను పురస్కరించుకుని బత్తిని సోదరులు ఉచితంగా అందజేసే చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం సజావుగా, ప్రశాంతంగా జరిగేలా అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు చక్కటి సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా ఆదేశించారు. ఈ నెల 8వ తేదీ ఉదయం నుంచి తొమ్మిదో తేదీ సాయంత్రం వరకు పంపిణీ చేయనున్న చేప ప్రసాదం కార్యక్రమానికి సంబంధించి వివిధ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. చేప ప్రసాదం పంపిణీ ఏర్పాట్లపై ఆయన శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ఈ నెల 8,9తే తేదీల్లో చేప ప్రసాదం కోసం విచ్చేసే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వ శాఖల కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా తొక్కిసలాట జరగకుండా, ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయాన్ని పెంచేందుకు, ఎప్పటికపుడు సమాచారాన్ని అన్ని శాఖలు షేర్ చేసుకునేందుకు వీలుగా ప్రత్యేకంగా ఓ కంట్రోల్ రూంను ఏర్పాటు చేసి, ఎప్పటికపుడు పరిస్థితులను పర్యవేక్షించాలని ఆదేశించారు. రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో కౌంటర్లు, రూట్లు, టొకెన్ కౌంటర్లు, చేప పిల్లల నిల్వ కోసం డ్రమ్ములను, చేప ప్రసాదం పంపిణీ క్యూ లైన్ల కోసం బ్యారికేడ్లు ఏర్పాటు చేయటం, విద్యుత్ సరఫరా అగిపోతే ప్రత్యామ్నాయంగా జనరేటర్లు, షామియానాలు, లైటింగ్, సిసి టివిలను ఏర్పాటు చేయాలన్నారు. పురుషులకు, మహిళలకు, వికలాంగుల సౌకర్యార్థం ప్రత్యేకంగా బ్యారికేడ్లను ఏర్పాటు చేయాలని, అలాగే విఐపిలకు కూడా విడిగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మత్స్యశాఖ అధికారులు చేప పిల్లలను ప్రజలు కొనుగోలు చేసేందుకు వీలుగా కౌంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. జలమండలి అధికారులు ప్రజలకు తాగునీరు ప్యాకేట్లను ఉచితంగా సరఫరా చేయటంతో పాటు మంచినీటి ట్యాంకర్లను అందుబాటులో ఉంచాలన్నారు. ఆర్టీసి అధికారులు రైల్వే, బస్ స్టేషన్లు, ఇతర ప్రధాన కూడళ్ల నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు ప్రత్యేక బస్సులను నడిపేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
జిహెచ్‌ఎంసి ఏర్పాట్లు..
మహానగర పాలక సంస్థ ఆధ్వర్యంలో కూడా చేప ప్రసాదం పంపిణీ జరిగే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిహెచ్‌ఎంసి ఆధ్వర్యంలో తాత్కాలిక టాయిలెట్లు ఏర్పాటు చేయటంతో పాటు వేలల్లో జనం వచ్చే అవకాశమున్నందున, చెత్తాచెదారాన్ని ఎప్పటికపుడు తొలగించేందుకు వీలుగా మూడు షిఫ్టుల్లో సిబ్బందిని అందుబాటులో ఉంచనున్నారు. వైద్య ఆరోగ్య శాఖ వారు కూడా అత్యవసర మెడికల్ టీమ్స్, మొబైల్ యూనిట్లు, అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
అధిక సంఖ్యలో ప్రజలొచ్చే అవకాశముంది
సెంట్రల్ జోన్ డిసిపి కమలాసన్ రెడ్డి
చేప ప్రసాదం స్వీకరించేందుకు ఈ సారి గత సంవత్సరం కన్నా మరింత ఎక్కువ సంఖ్యలో ప్రజలు వచ్చే అవకాశమున్నందున భద్రత ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు సెంట్రల్ జోన్ డిసిపి కమలాసన్ రెడ్డి సమావేశంలో కలెక్టర్‌కు వివరించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ మొత్తాన్ని సిసి కెమెరాల నిఘా పరిధిలోకి తీసుకురానున్న, ప్రతి ఒక్కరి కదలికలను ఎప్పటికపుడు గమనించేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. చేప ప్రసాదం పంపిణీ కోసం 180 మంది వాలంటీర్లు షిఫ్టుల వారీగా ఏర్పాటు చేసుకోవాలని ఆయన బత్తిని సోదరులకు సూచించారు.
8న..ఉ.8.30గం.లకు ప్రారంభం: బత్తిని
ఈ నెల 8వ తేదీన మృగశిరకార్తె ఉదయం ఎనిమిదిన్నర గంటలకు చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని సాంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించి ప్రారంభించనున్నట్లు బత్తిని హరినాధ్‌గౌడ్ సమావేశంలో వెల్లడించారు. ప్రసాదం తీసుకోదల్చిన వారు ఆ రోజు ఉదయం ఏడున్నర గంటల కల్లా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు చేరుకోవాలన్నారు. 9వ తేదీ సాయంత్రం వరకు కూడా కొనసాగే ఈ ప్రసాదం పంపిణీకి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సహకరించాలని ఆయన కోరారు.