హైదరాబాద్

‘త్రి శక్తం’ గ్రంథావిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, జూన్ 3: ప్రముఖ కవి డా.వడ్డేపల్లి కృష్ణ రచించిన ‘త్రి శక్తం’ గ్రంథావిష్కరణ సభ కినె్నర ఆర్ట్ థియేటర్స్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం గానసభలోని కళాసుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు డా.కెవి.రమణచారి పాల్గొని గ్రంథావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గీతాసారాంశం సంక్షిప్తంగా సామాన్యులను అర్థమయ్యే విధంగా వడ్డేపల్లి కృష్ణ ఎంతో గొప్పగా రచించారని పేర్కోన్నారు. డా.చంద్రారెడ్డి ఆంగ్ల రచనకు తెలుగుఅనువాదం చేయడం ఎంతో అభినందనీయమన్నారు. భారతీయ సంస్కృతిలో పవిత్రమైన గ్రంథం గీతాసారాంశం అని అన్నారు. భగవద్గీత చదివితే మనస్సుకు ఎంతో ప్రశాంతత కలుగుతుందని తెలిపారు. ప్రముఖ సాహితీవేత్త డా.వోలేటి పార్వతీశం సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో సర్వార్థ సంక్షేమ సమితి ఛైర్మెన్ పివి.మనోహరరావు, డా.మనస చెన్నప్ప, ఆవుల కృష్ణారెడ్డి, సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు డా.ఆర్.ప్రభాకరరావు, మద్దాళి రఘురామ్ పాల్గొన్నారు.