హైదరాబాద్

డి.పోచంపల్లి సమస్యలను పరిష్కరిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, జూన్ 3: దొమ్మరపోచంపల్లి సమస్యలను పరిష్కరిస్తానని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేక్ అన్నారు. శుక్రవారం కుత్బుల్లాపూర్ గ్రామంలో వివేక్ నివాసంలో గ్రామ సర్పంచ్ రాముగౌడ్, వార్డు సభ్యులు కలిసి సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రాన్ని అందజేశారు. రాముగౌడ్ మాట్లాడుతూ గ్రామంలో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని అన్నారు. మురుగునీటి ప్రవాహంతో రోగాల బారిన ప్రజలు పడుతున్నారని చెప్పారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న డ్రైనేజీ సమస్యను సాధ్యమైనంత త్వరలో పరిష్కరిస్తానని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధికి ఎళ్లవేళలా కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ నరేందర్‌రెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
జేఎసి సభ్యులకు జ్ఞాపికల ప్రదానం
కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని హెచ్‌ఎంటీ కాలనీ పోచమ్మ దేవాలయ ఆవరణలో చింతల్ డివిజన్‌లో తెలంగాణ ఉద్యమంలో నిరాహార దీక్షలు చేసిన జేఎసి సభ్యులకు స్థానిక ఎమ్మెల్యే కెపి వివేక్ ముఖ్యఅతిథిగా పాల్గొని జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ ఎంతోమంది అమరవీరుల త్యాగమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. బంగారు తెలంగాణ సాధనలో ప్రతిఒక్కరు భాగస్వాములు కావాలని సూచించారు. కార్యక్రమంలో రంగా శ్రీనివాస్‌గౌడ్, అబ్దుల్ ఖాదర్, సతీష్, బాల్‌రాజ్, రాజిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
టిఆర్‌ఎస్‌లో యువకుల చేరిక
చింతల్‌లో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేక్ సమక్షంలో వంద మంది యువకులు టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వివేక్ వారికి పార్టీ కండువాలను కప్పి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టిఆర్‌ఎస్ పార్టీలో వలసలుగా చేరుతున్నారని అన్నారు. పార్టీ పటిష్టతకు పాటుపడుతూ ప్రభుత్వం పథకాలు పేదలకు అందేవిధంగా పాటుపడాలని సూచించారు. కార్యక్రమంలో సాయిగౌడ్, రెహన్, సాయి, రాజు, శివ, అనిల్ పాల్గొన్నారు.