కర్నూల్

రూ. 55కోట్లతో మూడు క్లస్టర్ విశ్వవిద్యాలయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జూన్ 3:నగరంలోని కెవిఆర్, సిల్వర్ జూబ్లీ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో రూ. 55కోట్లతో మూడు క్లస్టర్ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి తెలిపారు. నగరంలో శుక్రవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లా కేంద్రంలో రూసా నిధులతో ఏర్పాటు చేసే క్లస్టర్ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి వీలవుతుందని తెలిపారు. జిల్లాలో ఏ కళాశాలలోనైనా ర్యాగింగ్ జరిగితే విద్యార్థులు ఫిర్యాదు చేయడానికి టోల్ ఫ్రీ నెంబర్‌ను ప్రవేశపెట్టామని తెలిపారు. ర్యాగింగ్‌పై ఆ నెంబర్‌కు సమాచారం అందిస్తే అధికారులు తక్షణం స్పందించి చర్యలు తీసుకుంటారని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో 10 కళాశాలలను రూసా పథకం కింద ఎంపిక చేసి అభివృద్ధి చేసిందని అందులో ఆత్మకూరు డిగ్రీ కళాశాల ఒకటని తెలిపారు. మారుమూల ప్రాంతంలోని కళాశాలను కేంద్రం గుర్తించడం హర్షణీయమని ఇందుకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి ధన్యవాదాలు తెలిపానన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో వైఫై సదుపాయం కల్పిస్తున్నామని వెల్లడించారు. విద్యార్థులు ఇంటర్‌నెట్‌ను సద్వినియోగం చేసుకుని తమ విద్యను, ఆ తరువాత లభించే అవకాశాలను తెలుసుకుని వ్యూహాత్మకంగా విద్యాభ్యాసం పూర్తి చేయాలన్నదే తమ ఉద్దేశ్యమని స్పష్టం చేశారు. ఉన్నత విద్య, భద్రతతో కూడిన ఉపాధి లభిస్తే యువత మెరుగైన ఫలితాలను సాధించి రాష్ట్ర, దేశాభివృద్ధికి తోడ్పతారన్నారు. సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా యువత మంచి మార్గాన్ని ఎంచుకుని ముందుకు సాగాలని కోరారు. అనవసర పరిజ్ఞానంతో యువత పెడదోవ పట్టకూడదని హితవు పలికారు. కర్నూలులో ప్రస్తుతం రూ. 112కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి పనులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా రూ. 4.5కోట్లతో శివారు కాలనీల్లో రహదారుల నిర్మాణం ప్రారంభమైందన్నారు. వీలైనంత వేగంగా నిధులను సద్వినియోగం చేస్తూ నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని వెల్లడించారు. తమ పార్టీ కానీ, ప్రభుత్వం కానీ ఏ ఒక్క వర్గాన్ని విస్మరించే ప్రశే్న లేదని వెల్లడించారు. అన్ని వర్గాలు తమకు సమానమే అన్నారు. చంద్రబాబును విమర్శించిన అనేక మంది నేతలు రాజకీయంగా ఎదుగుదలకు నోచుకోలేదని గుర్తుచేశారు. పార్టీలో ఏవైనా సమస్యలు ఉంటే వాటిని చంద్రబాబు వద్ద పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలే కానీ అనవసర విమర్శలతో భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. నవ నిర్మాణ దీక్షను విమర్శిస్తున్న కాంగ్రెస్ నేతలు రాష్ట్ర విభజనలో ప్రజలకు చేసిన అన్యాయాన్ని గుర్తు చేసుకోవాలని సూచించారు. వారు చేసిన పాపాలను కడగడానికే దీక్ష చేపట్టామని వెల్లడించారు. జగన్ తీరు మార్చుకోకపోతే ఆయనను ఎక్కడ, ఎలా కొట్టాలో అలా దెబ్బ కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. సమావేశంలో ఎమ్మెల్యే ఎస్వీ మోహనరెడ్డి, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి పాల్గొన్నారు.