ఖమ్మం

కలెక్టర్‌ను కలిసిన కొత్తగూడెం ఎమ్మెల్యే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖానాపురం హవేలి, జూన్ 3: కొత్తగూడెం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్‌ను కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు శుక్రవారం కలిసి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జలగం మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా పాత కొత్తగూడెంలో ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు శ్రీకారం చుట్టామన్నారు. అందుకు కావాల్సిన పాఠశాల నిర్మాణానికి నాలుగున్నర ఎకరాల భూమిని కేటాయించామన్నారు. శాశ్వత భవన నిర్మాణానికి నిధులు కేటాయించాలని కలెక్టర్‌ను కోరారు. తన నియోజకవర్గంలోని కొత్తగూడెం, పాల్వంచ ప్రాంతాల్లో మిషన్ కాకతీయ పనులు చేపట్టామన్నారు. కొత్తగూడెం మండలం సుజాతనగర్ పరిధిలోని సింగభూపాలెం ఆయకట్టు కింద 2వేల ఎకరాల భూమి సాగవుతుందని, పునరుద్ధరణలో దానిని 5 వేలకు పెంచేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ను కోరారు.