ఖమ్మం

స్మార్ట్‌సిటీకి అర్హత సాధిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(ఖిల్లా), జూన్ 3: కేంద్రం ప్రకటిస్తున్న స్మార్ట్‌సిటిల జాబితాలో ఖమ్మం నగరం చేరేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామని ఖమ్మం మేయర్ పాపాలాల్, కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వాల్‌ప్రాజెక్ట్ నిర్మాణంలో ప్రభుత్వం అవార్డు నివ్వడం తమకు మరింత బాధ్యత పెంచిందని పేర్కొన్నారు. రహదారుల అభివృద్ధి, కూడళ్ళు, డివైడర్ల ఏర్పాటు ఇప్పటికే పూర్తి చేశామని, వచ్చే ఏడాది ఆవిర్భావ దినోత్సవాల నాటికి ప్రతి ఇంటికి నల్లా, మరుగుదొడ్డి ఉండేలా చూసి ఓడిఎఫ్ నగరంగా తీర్చిదిద్దుతామని అన్నారు. నగరాన్ని అభివృద్ధి వైపు తీసుకువెళ్ళేందుకు ప్రణాళిక బద్ధంగా పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు. 24గంటలు నిరంతర నీటి సరఫరా, విద్యుత్, పారిశుద్ధ్య మెరుగు పరచేందుకు అన్ని చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. సోలార్ స్ట్రీట్‌లైట్లు ఏర్పాటు, తడిచెత్త, పొడిచెత్త సేకరించేందుకు ఇంటింటికి రెండు బుట్టలను పంపిణి చేయనున్నట్లు తెలిపారు. రూపాయికి పంపు కనెక్షన్ ఇవ్వడంతో పాటు కమర్షియల్, జనరల్ పంపు కనెక్షన్లు ఇవ్వనున్నామన్నారు. అదే విధంగా నిత్యం నగరానికి వస్తున్న ప్రజల కోసం పది చోట్ల సామూహిక మరుగుదొడ్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. నగరాభివృద్దికి అమృత్ కింద 45కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయని, వీటికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనున్న 45కోట్ల రూపాయలతో వాటర్ డెవలప్‌మెంట్ చేయనున్నామన్నారు. నగరాభివృద్ధిలో భాగంగా 12రోడ్ల విస్తరణ పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఖమ్మంను ఉత్తమ కార్పొరేషన్‌గా గుర్తించిన ముఖ్యమంతి కెసిఆర్, పురపాలక శాఖా మంత్రి కెటిఆర్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్ లోకేష్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. విలేఖరుల సమావేశంలో డిప్యూటీ మేయర్ మురళీప్రసాద్, కార్పొరేటర్లు కమర్తపు మరళీ, పగడాల నాగరాజు, డివిజనల్ పిఆర్వో ధశరధం పాల్గొన్నారు.