జాతీయ వార్తలు

ఏడాది చివరికల్లా బంగ్లాదేశ్ సరిహద్దు కంచె నిర్మాణం పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోహిమా, జూన్ 3: భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు కంచె నిర్మాణం ఈ ఏడాది చివరి నాటికల్లా పూర్తవుతుందని, ఆ తర్వాత ఇరువైపులనుంచి ఏ ఒక్కరు కూడా అక్రమంగా సరిహద్దులు దాటడానికి అనుమతించరని కేంద్ర న్యాయ శాఖ మంత్రి డివి సదానంద గౌడ చెప్పారు. సరిహద్దుల్లో కంచె నిర్మాణానికి సంబంధించి గత ఆరున్నర దశాబ్దాల కాలంలో ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగిందని, ఇరువైపుల కూడా రాజ్యాంగ సవరణను సైతం చేయడం జరుగుతోందని శుక్రవారం ఇక్కడ రాజ్‌భవన్‌లో విలేఖరులతో మాట్లాడుతూ సదానంద గౌడ చెప్పారు. కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న వేడుకల్లో భాగంగా గౌడ నిన్నటినుంచి కోహిమాలో ఉన్నారు.
భవిష్యత్తులో సరయిన పాస్‌పోర్టు లేకుండా ఏ ఒక్కరు కూడా అక్రమంగా సరిహద్దు దాటి చొరబడడాన్ని, వలస రావడాన్ని నిరోధించడం కోసం చేపడుతున్న ఈ కంచె నిర్మాణం ఈ ఏడాది డిసెంబర్ కల్లా పూర్తవుతుందని ఆయన చెప్పారు. ‘అతి త్వరలోనే బంగ్లాదేశ్ చొరబాట్లు ఆగిపోతాయి’ అని ఆయన చెప్పారు. సరిహద్దుల భద్రత, రక్షణకు ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తోందని, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇలా మన దేశానికి ఇతర దేశాలతో ఉన్న సరిహద్దుల్లో కంచె నిర్మాణం జరగాలనేది ప్రధాని మోదీ ఆలోచన అని ఆయన చెప్పారు.
బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన రెండు ప్రధాన విజయాలు సుపరిపాలన, అభివృద్ధి అని సదానంద గౌడ అంటూ, గత రెండేళ్ల కాలంలో మంత్రులకు వ్యతిరేకంగా ఒక్క అవినీతి లేదా కుంభకోణం ఆరోపణ రాలేదని అన్నారు. కాగా, మోదీ ప్రభుత్వం గత రెండేళ్ల కాలంలో సాధించిన విజయాలు, చేపట్టిన కార్యక్రమాలను ఆయన ఈ సందర్భంగా వివరించారు.

సిరియా బాంబు దాడుల్లో
31మంది దుర్మరణం

అలెప్పో (సిరియా), జూన్ 3: అంతర్యుద్ధంతో అల్లాడుతున్న సిరియాలో శుక్రవారం ప్రభుత్వ దళాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో దాడుల్లో 31మంది పౌరులు దుర్మరణం చెందారు. గత కొంతకాలంలో ప్రభుత్వ దళాలు, తిరుగుబాటుదారుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. అలెప్పో పట్టణ తూర్పు ప్రాంతంలో బాంబు దాడుల ధాటికి బస్సులో ప్రయాణిస్తున్న పదిమంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఘటనలో 21మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. తిరుగుబాటుదారులకు సహకరిస్తున్న ప్రాంతాలపై ప్రభుత్వ దళాలు దాడులను కేంద్రీకృతం చేశాయి. ప్రభుత్వ దళాలు ఇంత తీవ్ర స్థాయిలో విరుచుకుపడటం వారం రోజులుగా ఇదే తొలిసారి.

హైకోర్టుల్లో 458 మంది
న్యాయమూర్తుల కొరత

న్యూఢిల్లీ, జూన్ 3: దేశంలో హైకోర్టులు తీవ్రమైన న్యాయమూర్తుల కొరతను ఎదుర్కొంటున్నాయి. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ తాజా గణాంకాల ప్రకారం హైకోర్టుల్లో 458 మంది న్యాయమూర్తుల కొరత ఉంది. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకానికి అనుసరించే విధానపత్రంలోని కొన్ని క్లాజులపై న్యాయవ్యవస్థకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య విభేదాలు నెలకొన్న పరిస్థితుల్లో హైకోర్టుల్లో న్యాయమూర్తుల కొరత అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. 24 హైకోర్టుల్లో మొత్తం న్యాయమూర్తుల పదవులు 1079 ఉండగా, అందులో 621 మంది న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారు. మిగతా 458 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. న్యాయ మంత్రిత్వ శాఖ ఈ నెల ఒకటో తేదీన హైకోర్టుల్లో న్యాయమూర్తుల ఖాళీల సంఖ్యను ప్రకటించింది. ఉన్నత న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తుల నియామకానికి అనుసరించే సవరించిన విధానపత్రం (రివైజ్డ్ మెమోరాండం ఆఫ్ ప్రొసీజర్) ముసాయిదాను సుప్రీంకోర్టు కొలీజియం మే 30న కేంద్ర ప్రభుత్వానికి తిప్పిపంపిన విషయం తెలిసిందే. ఈ విధానంలోని రెండు అంశాల పట్ల కొలీజియం అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఢిల్లీలో కిడ్నీ రాకెట్ గుట్టు రట్టు

ఆరుగురు అరెస్టు

న్యూఢిల్లీ, జూన్ 2: దేశ రాజధాని ఢిల్లీలో కిడ్నీ రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. ఆగ్నేయ ఢిల్లీలోని ఓ ప్రముఖ ప్రైవేటు హాస్పిటల్‌పై దాడిచేసిన పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. ఇప్పటివరకు ఈ ముఠా నాలుగు కిడ్నీలను అమ్మినట్లు పోలీసులు వెల్లడించారు. ఉత్తర భారతంలోని ఓ గ్రామం నుంచి తీసుకొచ్చిన కిడ్నీ దాతలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. సరితా విహార్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు ముఠా నాయకుల కోసం గాలింపు జరుపుతున్నారు.